మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం: లోకం
ABN , Publish Date - Nov 23 , 2025 | 11:35 PM
రైతుల సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పని చేస్తోందని, మౌలిక వసతుల కల్పనకు ప్రాధా న్యం ఇస్తున్నామని ఎమ్మెల్యే లోకం నాగమాధవి తెలిపారు.
నెల్లిమర్ల, నవంబరు 23(ఆంధ్రజ్యోతి): రైతుల సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పని చేస్తోందని, మౌలిక వసతుల కల్పనకు ప్రాధా న్యం ఇస్తున్నామని ఎమ్మెల్యే లోకం నాగమాధవి తెలిపారు. ఆదివారం మండలంలో సతివాడ సొ సైటీలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిం చారు.సతివాడ, నెల్లిమర్ల, జరజాపుపేటల్లో ఆమె పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చే శారు.కార్యక్రమంలో ఏవో శ్రీలక్ష్మి,ఎంపీడీవో రామ కృష్ణరాజు, డిప్యూటీ ఎంపీడీవో శంకర జగన్నాథం, సతివాడ సొసైటీ సెక్రటరీ కె.సత్తిబాబు, జనసేన నాయకుడు చనమల్లు వెంకటరమణ, టీడీపీ నగర పంచాయతీ అధ్యక్షుడు లెంక అప్పలనాయుడు, బంగారు సరోజిని, కరుమజ్జి గోవిందరావు, రవ్వా నాని పాల్గొన్నారు.