Share News

Housing Construction గృహ నిర్మాణాలకు ప్రాధాన్యం

ABN , Publish Date - Nov 13 , 2025 | 12:16 AM

Priority for Housing Construction పేదల గృహ నిర్మాణాలకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. బుధవారం పట్టణంలోని 12వ వార్డులో గృహ ప్రవేశ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి చేతుల మీదుగా గృహ ప్రవేశాలు, ఇళ్ల పనులకు శంకుస్థాపన కార్యక్రమాలు చేపట్టారు.

 Housing Construction  గృహ నిర్మాణాలకు ప్రాధాన్యం
లబ్ధిదారులకు తాళం అందజేస్తున్న మంత్రి

సాలూరు, నవంబరు 12(ఆంధ్రజ్యోతి): పేదల గృహ నిర్మాణాలకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. బుధవారం పట్టణంలోని 12వ వార్డులో గృహ ప్రవేశ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి చేతుల మీదుగా గృహ ప్రవేశాలు, ఇళ్ల పనులకు శంకుస్థాపన కార్యక్రమాలు చేపట్టారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. జిల్లాలో 22 వేల 833 ఇళ్లు మంజూరు చేయగా.. ఇందులో 15 వేల 661 గృహ నిర్మాణాలు పూర్తయ్యాయన్నారు. సాలూరు మున్సిపాలిటీలో 195 ఇళ్లకు ఆమోదం లభించిందన్నారు. పీఎం జన్‌మన్‌ పథకంలో పీవీటీజీల కోసం 5వేల 169 ఇళ్లు మంజూరు చేయగా 4 వేల 263 ఇళ్లు గ్రౌండింగ్‌ అయ్యాయని వెల్లడించారు. సాలూరు, పార్వతీపురం, పాలకొండలో కొత్తగా 634 ఇళ్లకు ఆమోదం లభించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - Nov 13 , 2025 | 12:16 AM