Share News

డ్రోన్‌ పోలీసింగ్‌తో నేరాలకు అడ్డుకట్ట

ABN , Publish Date - Sep 25 , 2025 | 11:54 PM

డ్రోన్‌ పోలీసింగ్‌తో నేరాలకు అడ్డుకట్ట వేయాలని ఎస్పీ ఎస్‌వీ మాధవరెడ్డి అన్నారు.

 డ్రోన్‌ పోలీసింగ్‌తో నేరాలకు అడ్డుకట్ట
సమీక్షిస్తున్న ఎస్పీ మాధవరెడ్డి

- ఎస్పీ మాధవరెడ్డి

బెలగాం, సెప్టెంబరు 25 (ఆంధ్రజ్యోతి): డ్రోన్‌ పోలీసింగ్‌తో నేరాలకు అడ్డుకట్ట వేయాలని ఎస్పీ ఎస్‌వీ మాధవరెడ్డి అన్నారు. గురువారం పోలీస్‌ సమావేశ మందిరంలో నెలవారీ నేర సమీక్షను ఎస్పీ వర్చువల్‌గా నిర్వహించారు. శాంతి భద్రతల పరిరక్షణ, గ్రేవ్‌, నాన్‌ గ్రేవ్‌ కేసులు, మర్డర్‌, ప్రాపర్టీ, చీటింగ్‌, గంజాయి, రోడ్డు ప్రమాదాలు తదితర కేసులపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గంజాయి వంటి నిషేధిత పదార్ధాల అక్రమణ రవాణా నియంత్రణకు, పేకాట, ఓపెన్‌ డ్రింకింగ్‌, గంజాయి సేవించడం వంటి అసాంఘిక కార్యక్రమాలను నిలువరించేందుకు ప్రతిరోజూ డ్రోన్‌ పోలీసింగ్‌ నిర్వహించాలని ఆదేశించారు.నేరాల దర్యాప్తులో సాంకేతికతను జోడించి, పెండింగ్‌ కేసులను త్వరతగతిన పూర్తి చేయాలని సూచించారు. ‘సుదీర్ఘ పెండింగ్‌ కేసుల దర్యాప్తును పూర్తి చేసి ఛార్జ్‌షీట్స్‌ కోర్టుకు సమర్పించాలి. గంజాయి, సారా, మాదకద్రవ్యాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలి. గంజాయి కేసుల్లో పరారీలో ఉన్న ముద్దాయిలను అరెస్టు చేసేలా చర్యలు తీసుకోవాలి. పోలీసు స్టేషన్లలో నమోదైన ప్రతీ కేసు వివరాలను క్షుణ్ణంగా సీసీటీఎన్‌ఎస్‌లో ఎప్పటికప్పుడు పొందుపరచాలి. హెల్మెట్‌ ధారణపై వాహనచోదకులకు అవగాహన కల్పించాలి. రోడ్డు భద్రతా నిబంధనులు అతిక్రమించిన వారిపై కేసులు నమోదు చేయాలి. మహిళా సంబంధిత నేరాలపై ప్రత్యేక శ్రద్ధతో దర్యాప్తు జరపాలి. పోక్సో, ఎస్సీ, ఎస్టీ కేసుల్లో మహిళలపై దాడులు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలి. సైబర్‌ నేరాలపై, శక్తి యాప్‌, మత్తు పదార్ధాల వినియోగంతో కలిగే అనర్ధాల గురించి విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి.’ అని ఎస్పీ తెలిపారు. ఈ సమావేశంలో ఏఆర్‌ డీఎస్పీ థామస్‌రెడ్డి, సీఐలు శ్రీనివాస్‌, అప్పారావు, రమేష్‌, ఎస్‌ఐలు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 25 , 2025 | 11:54 PM