అసాంఘిక శక్తుల ఆగడాలను అరికట్టండి
ABN , Publish Date - May 28 , 2025 | 12:30 AM
విద్యల నగరమైన విజయనగరంలో అసాంఘిక శక్తులు తయారు కావడం చా లా బాధాకరమని..వీరి ఆగడాలను అరికట్టా లని ఏపీ సాధు పరిషత్ అధ్యక్షుడు శ్రీని వాసానంద సరస్వతి అన్నారు.
ఏపీ సాధు పరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి
విజయనగరం కలెక్టరేట్, మే 27 (ఆంధ్ర జ్యోతి): విద్యల నగరమైన విజయనగరంలో అసాంఘిక శక్తులు తయారు కావడం చా లా బాధాకరమని..వీరి ఆగడాలను అరికట్టా లని ఏపీ సాధు పరిషత్ అధ్యక్షుడు శ్రీని వాసానంద సరస్వతి అన్నారు. అసాంఘిక శక్తులను అడ్డుకోవాలని కోరుతూ కలెక్టర్ అంబేడ్కర్‌కు మంగళవారం వినతిపత్రం అందించారు. అనంతరం ఆయన విలేకరు లతో మాట్లాడారు. గతంలో ఉభయ రాష్ట్రా ల్లో ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు వెలుగు చూసినా మూలాలు హైదరాబాద్ పాతబస్తీలో ఉండేవని గుర్తు చేశారు. ఇప్పుడు అటువంటి మూలాలు విజయనగరంలో ఉంటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నగరం మరో పాత బస్తీగా తయారు కావడానికి కుట్ర జరుగుతోందని ఆరోపించారు. ఉగ్రలింకులతో సంబంధం ఉన్న సిరాజ్ కుటుంబ సభ్యులపై కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.