Deaths మాతాశిశు మరణాలను అరికట్టాలి
ABN , Publish Date - Dec 23 , 2025 | 12:24 AM
Prevent Maternal and Infant Deaths మాతా శిశు మరణాలను అరికట్టాలని, వాటిపై జవాబుదారీతనం ఉండాలని వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి సౌరభ్‌గౌర్ ఆదేశించారు. సోమవారం విశాఖ ఆంధ్ర మెడికల్ కళాశాల వీసీ భవనంలో ఉత్తర కోస్తా జిల్లాల వైద్య సిబ్బందితో సమీక్షించారు.
జోనల్ స్థాయి సమావేశానికి హాజరైన జిల్లా బృందం
పార్వతీపురం, డిసెంబరు 22 (ఆంధ్రజ్యోతి): మాతా శిశు మరణాలను అరికట్టాలని, వాటిపై జవాబుదారీతనం ఉండాలని వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి సౌరభ్‌గౌర్ ఆదేశించారు. సోమవారం విశాఖ ఆంధ్ర మెడికల్ కళాశాల వీసీ భవనంలో ఉత్తర కోస్తా జిల్లాల వైద్య సిబ్బందితో సమీక్షించారు. ఈ సందర్భంగా పార్వతీపురం మన్యం నుంచి తన బృందంతో హాజరైన డీఎంహెచ్‌వో భాస్కరరావు జిల్లా ప్రగతిని వివరించారు. అనంతరం సౌరభ్‌గౌర్.. జిల్లాల వారీగా వైద్య, ఆరోగ్య కార్యక్రమాలు అమలు తీరును అడిగి తెలుసుకున్నారు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. ప్రతి నివేదికలను డిజటలైజేషన్ చేయాలన్నారు. దీనివల్ల జిల్లాల ఆరోగ్య సమాచారాన్ని ఉన్నతాధికారులు త్వరితగతిన పరిశీలించడానికి వీలుంటుందని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా పోగ్రాం అధికారులు జగన్మోహన్‌రావు, రఘుకుమార్, వినోద్‌కుమార్, కౌశిక్, లీలారాణి, మణిరత్నం తదితరులు పాల్గొన్నారు.