Share News

“President!” విద్యార్థుల నోట అధ్యక్షా!

ABN , Publish Date - Nov 25 , 2025 | 11:43 PM

“President!” Chant the Students పాఠశాల విద్యార్థులు అసెంబ్లీలో అధ్యక్షా! అనేందుకు సిద్ధమయ్యారు. నియోజకవర్గ సమస్యలతో పాటు పలు అంశాలపై గళమెత్తనున్నారు. ఇందుకోసం వారంతా అమరావతికి పయనమయ్యారు. రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం అసెంబ్లీ ఆవరణలో మాక్‌ అసెంబ్లీ నిర్వహించనున్నారు. ఇందులో జిల్లా విద్యార్థులు పాల్గొను న్నారు.

“President!”  విద్యార్థుల నోట అధ్యక్షా!
సీఎంగా ఎంపికైన జడ్పీహెచ్‌ఎస్‌ బీజేపురం టెన్త్‌ విద్యార్థి లీలా గౌతం

  • పయనమైన మన్యం విద్యార్థులు

  • వారిలో సీఎం హోదాకు ఒకరు ఎంపిక

  • సమస్యలతో పాటు పలు అంశాలపై చర్చ

పాలకొండ, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి): పాఠశాల విద్యార్థులు అసెంబ్లీలో అధ్యక్షా! అనేందుకు సిద్ధమయ్యారు. నియోజకవర్గ సమస్యలతో పాటు పలు అంశాలపై గళమెత్తనున్నారు. ఇందుకోసం వారంతా అమరావతికి పయనమయ్యారు. రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం అసెంబ్లీ ఆవరణలో మాక్‌ అసెంబ్లీ నిర్వహించనున్నారు. ఇందులో జిల్లా విద్యార్థులు పాల్గొను న్నారు. ప్రజాప్రతినిధుల హోదాలో పలు అంశాలపై చర్చించనున్నారు. వీరిలో అసెంబ్లీ మార్షల్‌గా జియ్యమ్మవలస మండలం జడ్పీహెచ్‌ఎస్‌ బీజేపురం టెన్త్‌ విద్యార్థి మద్ది లీలా గౌతం ఎంపికయ్యాడు. ఆ విద్యార్థి ఫెర్ఫార్మెన్స్‌ బాగుండడంతో ఏకంగా సీఎం సీటుకే ఎంపికయ్యాడు. గరుగుబిల్లి జడ్పీహెచ్‌ఎస్‌ పదో తరగతి విద్యార్థి డి.దినేష్‌కుమార్‌ ఎమ్మెల్యే హోదాలో మాక్‌ అసెంబ్లీకి హాజరుకానున్నారు. పాలకొండ మండలం ఎం.సింగుపురం జడ్పీ హెచ్‌ఎస్‌ పదో తరగతి విద్యార్థిని గంధారపు నిహారిక ఎమ్మెల్యేగా ఎంపికైంది. బలిజిపేట కేజీబీవీలో 9వ తరగతి చదువు తున్న దువ్వు జయంతి ఆర్థికశాఖామం త్రిగా అసెంబ్లీకి వెళ్లనుంది. మక్కువ జడ్పీహెచ్‌ఎస్‌ పదో తరగతి విద్యార్థిని సాయిసౌమ్య ప్రతిపక్ష ఎమ్మెల్యేగా మాక్‌ అసెంబ్లీకి హాజరుకానున్నారు. వారంతా రాజ్యాంగ ఆవశ్యకత, విలువలు, ప్రజా ప్రతినిధుల బాధ్యతలు, విధులు, ప్రజా సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలు తదితర అంశాలపై చర్చించనున్నారు.

ఎంపిక ఇలా...

రాజ్యాంగ దినోత్సవం పురస్కరించుకుని కూటమి ప్రభుత్వం విద్యార్థులతో మాక్‌ అసెంబ్లీ నిర్వహించాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో పాఠశాలల్లో వ్యాసరచన, క్విజ్‌ పోటీలు నిర్వహిం చారు. అనంతరం మండలం, నియోజకవర్గ స్థాయిలో విద్యార్థులను ఎంపిక చేశారు. చివరిగా వారిలో నియోజకవర్గానికి ఒకరి చొప్పున ఎంపిక చేశారు. జిల్లాలో మార్షల్‌గా ఎంపికైన లీలాగౌతం ప్రతిభను గుర్తించి అధికారులు ముఖ్యమంత్రి హోదాకు ఎంపిక చేయడం గమనార్హం.

జిల్లా విద్యార్థి సీఎంగా ఎంపిక

రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టనున్న మాక్‌ అసెంబ్లీకి జిల్లా విద్యార్థులు ఎంపిక కావడం సంతోషకరం. వారిలో మార్షల్‌గా ఎంపికైన విద్యార్థి లీలా గౌతంను ముఖ్యమంత్రి హోదాకు ఎంపిక చేయడం హర్షణీయం. వీరు జిల్లాలోని ప్రజా ప్రతినిధులు మాదిరిగానే పలు అంశాలపై మాక్‌ అసెంబీల్లోలో చర్చిస్తారు.

- బి.రాజ్‌కుమార్‌, డీఈవో

Updated Date - Nov 25 , 2025 | 11:43 PM