ఏటీఆర్ సిద్ధంచేయండి
ABN , Publish Date - Dec 27 , 2025 | 12:09 AM
: యాక్షన్ టేకెన్ రిపోర్టు (ఏటీఆర్) సిద్ధం చేయాలని అధికారులకు బొబ్బిలి ఎమ్మెల్యే బేబీనా యన కోరారు. తమపరిధిలో ఉన్న సమస్యలను పరిష్కరిస్తామని, ఇతర సమస్యలు జిల్లా కలెక్టరు, రాష్ట్రస్థాయి సమస్యలపై సంబంధిత ఉన్న తాధికారుల దృష్టికి తీసుకువెళ్తామని చెప్పారు.
బొబ్బిలి, డిసెంబరు 26(ఆంధ్రజ్యోతి): యాక్షన్ టేకెన్ రిపోర్టు (ఏటీఆర్) సిద్ధం చేయాలని అధికారులకు బొబ్బిలి ఎమ్మెల్యే బేబీనా యన కోరారు. తమపరిధిలో ఉన్న సమస్యలను పరిష్కరిస్తామని, ఇతర సమస్యలు జిల్లా కలెక్టరు, రాష్ట్రస్థాయి సమస్యలపై సంబంధిత ఉన్న తాధికారుల దృష్టికి తీసుకువెళ్తామని చెప్పారు. శుక్రవారం బొబ్బిలి మునిసిపల్ కార్యాలయంలో బేబీనాయన ఆధ్వర్యంలో ప్రజాసమస్యల పరిష్కారవేదిక (పీజీఆర్‌ఎస్) కార్యక్రమం నిర్వహించారు. కౌన్సిలర్లతో పాటు పలువురు తమ సమస్యలను ఎమ్మెల్యేకు వివరించారు. ఈ సం దర్భంగా బొబ్బిలిసీహెచ్‌సీలో డయాలసిస్‌కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని టి.రమేష్ కోరారు. ట్రాఫిక్ సమస్య, రోడ్లవిస్తరణ, చినబజారులో ఇరుకైన రోడ్లు తదితర అంశాలపై కళింగవైశ్యసంఘం అధ్యక్షుడు గెంబలి శ్రీనివాసరావ వినతిపత్రం సమర్పించారు. ఐదో వార్డులో ప్రజలు ఎదు ర్కొంటున్న సమస్యలపై కౌన్సిలర్ వెలగాడ హైమావతి వినతిపత్రం అందజేశారు. పాతబొబ్బిలిలో చాలా ఏళ్లుగా పెండింగ్‌లోఉన్న ఇరిగేషన్, ఇతర సమస్యలను పరిష్కరించాలని ఒకటో వార్డు కౌన్సిలరు చోడిగంజి రమేష్‌నాయుడు ఆధ్వర్యంలో గ్రామస్థులు గొల్లపల్లిలో కాకల వెంక టరావు, బొబ్బాది తవిటినాయుడు వినతులు అందజేశారు.నాయుడుకా లనీ సమస్యలపై పలువురు ఉపాధ్యాయులు వినతులిచ్చారు. ఇంది రమ్మకాలనీలో సమస్యలను పరిష్కరించాలని ఆ వార్డుకు చెందిన తెర్లి రామ్మోహనరావు, జగదీశ్, నాగరాజు తదితరులు కోరారు. ప్రజల నుంచి రెవెన్యూ, విద్యుత్, మునిసిపల్, హౌసింగ్, ఇరిగేషన్ తదితర అంశాలకు సంబంధించి మొత్తం 87 వినతులొచ్చాయి. కార్యక్రమంలో మునిసిపల్ చైర్మన్ రాంబార్కి శరత్‌బాబు, వైస్‌చైర్మన్ చెలికాని మురళీకృష్ణ, కమిష నరు లాలం రామలక్ష్మి, తహసీల్దార్ మలపురెడ్డి శ్రీను, విద్యుత్, హౌసిం గ్, ఇరిగేషన్, ఐసీడీఎస్ అధికారులు సాంబశివరావు, రెడ్డి వేణుగోపాల్, జె,విజయలక్ష్మి, వైద్యాధికారులు, మునిసిపల్ అధికారులు, సిబ్బంది, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.