రబీకి ప్రణాళికలు సిద్ధంచేయండి: కలెక్టర్
ABN , Publish Date - Sep 23 , 2025 | 11:52 PM
రాబో యే రబీ సీజన్‌లో సాగు ప్రణాళికలు సిద్ధం చేయాలని కలెక్టర్ ఎన్.రాంసుందర్ రెడ్డి ఆదేశించారు.
విజయనగరం, సెప్టెంబరు 23(ఆంధ్రజ్యోతి): రాబో యే రబీ సీజన్‌లో సాగు ప్రణాళికలు సిద్ధం చేయాలని కలెక్టర్ ఎన్.రాంసుందర్ రెడ్డి ఆదేశించారు. వ్యవసాయ అనుబంధ రంగాల్లో 15 శాతం వృద్ధి రేటు సాధించే విధంగా కృషిచేయాలని సూచించారు. మంగళవారం వ్యవసాయ, అనుబంధ శాఖల పనితీరుపై కలెక్టర్ ఆడి టోరియంలో సమీక్షించారు. వరిసాగులో గతఏడాది 95 శాతం లక్ష్యంసాధించగా ఈ ఏడాది 97శాతం చేరుకుం దని తెలిపారు రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరు వులు సమయానికి అందేలా చర్యలు చేపట్టాలని తెలి పారు. రైతులకు ఈ-పంట బుకింగ్, వ్యవసాయ యంత్రాలు, డ్రోన్ల వినియోగం వంటి సదుపాయాలను విస్తరించాలని ఆదేశించారు. పశుసంవర్ధక శాఖ రంగంలో పాలు, మాంసం, గుడ్లు 8.4 శాతం పెరుగుదల వల్ల ఉత్పత్తిలో 15 శాతం వృద్ధి సాధించవచ్చ న్నారు. రైతు బజార్లు, శుభ్రత, పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, రైతు బజార్లను సందర్శిస్తామని కలెక్టర్ తెలిపారు.సమావేశంలో జిల్లా వ్యవసాయఅధికారి భారతి, జిల్లా ఉద్యాన అధికారి చిట్టిబాబు, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి దామోదరరావు, ఏపీఎం ఐసీ పీడీ పీఎన్‌వీ లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.
ఉత్సవాలకు చిత్తశుద్ధితో పనిచేయాలి
విజయనగరం ఉత్సవాల నిర్వహణ కోసం పలు కమిటీల్లో నియమించిన అధికా రులు వ్యక్తిగతంగా, మనసు పెట్టి చిత్త శుద్ధితో పనిచేయాలని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి కోరారు. కలెక్టరేట్‌లో ఉత్సవ కమిటీ సభ్యులతో సమీక్షించారు. వేదిక, కార్యక్రమం వారీగా ప్రణాళికాబద్ధంగా యాక్షన్ ప్లాన్ తయారుచేసుకొని ఉత్సవాలను ఎటువంటి లోటు లేకుండా నిర్వహించాలని తెలిపారు. గత ఏడాది నిర్వహించిన అన్ని రకాల కార్యక్రమా లు ఉంటాయని చెప్పారు. సమావేశంలో జేసీ సేతుమాధవన్ పాల్గొన్నారు.
పరిశ్రమల కోసం వచ్చిన దరఖాస్తులకు అనుమతులివ్వాలి
గడువులోగా పరిశ్రమల స్థాపన కోసం వచ్చిన దరఖాస్తులకు అనుమతులివ్వాలని కలెక్టర్ ఎన్.రాంసుందర్ రెడ్డి తెలిపారు. మంగళవారం కలెక్టర్ చాంబర్‌లో జిల్లా స్థాయి పరిశ్రమల ప్రోత్సాహక కమిటీసమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ సింగిల్ డెస్క్ పోర్టల్ ద్వారా అందిన 893 దరఖాస్తులకు 67 దరఖాస్తులు పెండింగ్ ఉన్నాయని, వీటిని గడువులోగా పరిష్కరించాలని తెలిపారు. పీఎం ఈజీపీ కింద 151 దరఖాస్తులు గ్రౌండ్‌అయ్యాయని, వాటి జాబితీను అందజేయాలని జిల్లా మేనేజర్‌కు సూచించారు.సమావేశంలో పరిశ్రమల జిల్లా మేనేజర్ కరుణాకర్, ఎల్‌డీఎమ్ మూర్తి, నాబార్డ్ డీడీఎం నాగార్జున, పిసీబీ ఈఈ సరిత పాల్గొన్నారు.
పోలీసుల పని తీరు మార్చుకోవాలి: ఎస్పీ
విజయనగరం క్రైం, సెప్టెంబరు 23 (ఆంధ్రజ్యోతి):పోలీసు అధికారులు, సిబ్బంది మారుతున్న నేరాలకు అనుగుణంగా పనితీరు మార్చుకోవాలని ఎస్పీ ఏఆర్ దామో దర్ అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నేర సమీక్షలో దర్యాప్తులో ఉన్న గ్రేవ్, నాన్ గ్రేవ్, ఎంజీపీఎస్, ఫోక్సో, అట్రాసిటీ, మిస్సిం గ్, రోడ్డు ప్రమాద కేసులను పెండింగ్ కేసులను సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసుస్టేషన్‌కు వచ్చిన ఫిర్యాదు దారుల పట్ల మర్యాదగా వ్యవహరించాలని, స్టేషన్‌కు వచ్చిన కారణాలు తెలుసుకొని వారికి సహాయప డాలన్నారు. సమావేశంలో ఏఎస్పీలు సౌమ్మలత, నాగేశ్వరరావు, డీఎస్పీలు ఆర్ గోవిందరావు, రాఘవులు, వీరకుమార్ పాల్గొన్నారు. కాగా విజయనగరంలో వచ్చే నెల ఆరు, ఏడు తేదీల్లో జరగబోయే పైడి తల్లి అమ్మవారి తొలేళ్లు, సిరిమానోత్సవం భద్రతా ఏర్పాట్లను కలెక్టర్ రాంసుందర్ రెడ్డితో ఎస్పీ ఏఆర్ దామోదర్ మంగళ వారం పరిశీలించారు. సిరిమాను తిరిగేమార్గం, ఆలయ పరిసరాలు, సిరిమాను తయారయ్యే హుకుంపేట ప్రాంతాలను పరిశీలించారు. పార్కింగ్‌కు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పార్కింగ్ స్థలాలను గుర్తించాలని ఆదేశించారు. కార్యక్ర మంలో ఏఎస్పీ సౌమ్యలత, ఆర్డీవో కీర్తి, డీఎస్పీ ఆర్ గోవిందరావు, దేవదాయ శాఖ ఏసి శిరీష, నగరపాలక సంస్థ కమిషనర్ నల్లనయ్య పాల్గొన్నారు.