Share News

అమ్మవారి ఉత్సవాలకు సన్నద్ధం

ABN , Publish Date - May 31 , 2025 | 12:19 AM

పార్వతీపురం పట్టణం, జగన్నాథపురం, బెలగాం ప్రజల ఇలవేల్పులు ఇప్పలపోలమ్మ, యర్రకంచమ్మ, బంగారమ్మల పండుగలను ఆదివారం నుంచి నిర్వహించేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

అమ్మవారి ఉత్సవాలకు సన్నద్ధం

  • చురుగ్గా ఇప్పలపోలమ్మ, యర్రకంచమ్మ, బంగారమ్మల పండుగ ఏర్పాట్లు

పార్వతీపురం టౌన్‌, మే 30 (ఆంధ్రజ్యోతి): పార్వతీపురం పట్టణం, జగన్నాథపురం, బెలగాం ప్రజల ఇలవేల్పులు ఇప్పలపోలమ్మ, యర్రకంచమ్మ, బంగారమ్మల పండుగలను ఆదివారం నుంచి నిర్వహించేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. మున్సిపల్‌, విద్యుత్‌ సిబ్బంది సంబంధిత విభాగాలకు చెందిన పనులు చేపడుతున్నారు. ఉత్సవాలకు విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల నుంచి సుమారు 3 లక్షల మంది వరకు వచ్చే అవకాశం ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

తాగునీరు, పారిశుధ్యానికి రూ.40 లక్షలు

ఉత్సవాల నేపథ్యంలో తాగునీటి సరఫరా, పారి శుధ్య పనులకు రూ.40 ఖర్చులు చేస్తున్నట్లు మున్సి పల్‌ అధికారులు తెలిపారు. పార్వతీపురం మున్సి పాల్టీలో 103 మంది పారిశుధ్య కార్మికులు ఉండ గా... అదనంగా 30 మందిని నియమిస్తున్నారు. మూడు రోజుల పాటు నిరంతరం తాగునీటి సరఫరా చేయనున్నట్టు అధికారులు తెలిపారు. జిల్లా కేంద్రంలోని 30 వార్డులతో పాటు శివారు కాలనీలకు ట్యాంకర్లతో తాగునీటి సరఫరా చేస్తామని ఇంజనీరింగ్‌ అధికారులు తెలిపారు.

విద్యుత్‌ సరఫరాకు...

యర్రకంచమ్మ తల్లి సిరిమాను వెళ్లేందుకు వీలుగా టౌన్‌ పోలీసు స్టేషన్‌ నుంచి జగన్నాథపు రం వరకు గల వీధుల్లో 17 నూతన విద్యుత్‌ స్తం భాలను ఆ శాఖాధికారులు వేసున్నారు. వరహాల గెడ్డ నుంచి రాయగడ రోడ్డు శివారు వరకు సిరి మానులు తిరుగుతున్న సమయంలో విద్యుత్‌ సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపడుతున్నారు. రాయగడ రోడ్డు, వివేకానంద కాలనీ, కొత్తవలస, బంగారమ్మ కాలనీల్లో 40 కేవీ ట్రాన్స్‌ఫార్మర్‌లతో పాటు నూతనంగా 100 కేవీ ట్రాన్స్‌ఫార్మర్లను ఏర్పాటు చేస్తున్నారు. ఈ పనులకు రూ.70 లక్షలు ఖర్చు చేస్తున్నామని డీఈ వెంకటరమణ తెలిపారు.

Updated Date - May 31 , 2025 | 12:19 AM