ఏరియా ఆసుపత్రిలో గర్భిణి మృతి
ABN , Publish Date - Aug 29 , 2025 | 12:23 AM
స్థానిక ఏరియా ఆసుపత్రిలో నిండు గర్భిణి బుధవారం మృతిచెందింది.
పాలకొండ, ఆగస్టు 28 (ఆంధ్రజ్యోతి): స్థానిక ఏరియా ఆసుపత్రిలో నిండు గర్భిణి బుధవారం మృతిచెందింది. తంపటాపల్లికి చెందిన బొమ్మాళి పద్మ కుటుంబ సభ్యులతో కలిసి భర్త అనీల్(రవి) ప్రసవం కోసం బుధవారం ఉద యం ఏరియా ఆసుపత్రికి తీసుకొచ్చారు. పురిటినొప్పులతో బాధపడుతున్న పద్మ ను వైద్య సిబ్బంది సేవలందించేందుకు చర్యలు తీసుకున్నారు. ఆ సమయంలో డ్యూటీ డాక్టర్‌గా ఉన్న ఈఎన్‌టీ వైద్యులు రాజేశ్వరరావు పర్యవేక్షణలో వైద్య సిబ్బంది వైద్య సేవలందించారు. గైనకాలజిస్ట్ అందుబాటులో లేరు. అయితే గైనకాలిస్ట్ సమక్షంలో వైద్యం అందించాలని కుటుంబ సభ్యులు కోరారు. కొద్దిసే పు వైద్యం అందించిన తర్వాత ఆమె పరిస్థితి విషమంగా మారడంతో డ్యూటీ డాక్టర్ భారతికి ఫోన్‌లో సమాచారం అందించారు. విషయం తెలుసుకొని ఏరి యా ఆసుపత్రికి చేరుకొని వైద్య పరీక్షలు చేశారు. పద్మ పరిస్థితి విషమంగా ఉందని శ్రీకాకుళం తరలించాలని సూచించారు. కొద్దిసేపటి తర్వాత పద్మ మృతి చెందడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. వైద్య సిబ్బంది సకాలంలో గైనకాలజిస్ట్‌కు సమాచారం ఇవ్వలేదని నిలదీశారు. ఏరియా ఆసుపత్రి సూపరిం టెండెంట్ చిరంజీవితో వాగ్వాదానికి దిగారు. తంపటాపల్లికి చెందిన పెద్దలు ఏరియా ఆసుపత్రికి చేరుకోగా సిబ్బంది, వైద్యులు అందించిన వైద్యంపై వివరిం చారు. దీంతో వారు శాంతించారు. ఎటువంటి పోస్టుమార్టం నిర్వహించకుండానే కుటుంబ సభ్యులు ఆసుపత్రి నుంచి మృతదేహాన్ని తరలించారు. పద్మకు మూడో కాన్పు కావడం గమనార్హం. కాగా ఏరియా ఆసుపత్రిలో బుధవారం నిండు గర్భిణి మృతిపై మన్యం డీసీహెచ్‌ఎస్ జి.నాగభూషణరావు వైద్య సిబ్బందిని, వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలు, కుటుంబ సభ్యులను విచారణ నిర్వహించారు. ఏరియా ఆసుపత్రిలో వైద్యసేవలపై అడిగి తెలుసుకున్నారు. విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.