Share News

Fertilizer Usage ఎరువుల వినియోగంలో జాగ్రత్తలు పాటించాలి

ABN , Publish Date - Sep 11 , 2025 | 12:06 AM

Precautions Must Be Taken in Fertilizer Usage ఎరువుల వినియోగంలో రైతులు జాగ్రత్తలు పాటించాలని జిల్లా వ్యవసాయాధికారి కె.రాబర్ట్‌పాల్‌ సూచించారు. బుధవారం సంతోషపురంలో రైతులకు యూరియా వాడకంపై అవగాహన కల్పించారు.

 Fertilizer Usage ఎరువుల వినియోగంలో  జాగ్రత్తలు పాటించాలి
సంతోషపురంలో అవగాహన కల్పిస్తున్న జిల్లా వ్యవసాయ శాఖాధికారి రాబర్ట్‌పాల్‌

గరుగుబిల్లి, సెప్టెంబరు 10(ఆంధ్రజ్యోతి): ఎరువుల వినియోగంలో రైతులు జాగ్రత్తలు పాటించాలని జిల్లా వ్యవసాయాధికారి కె.రాబర్ట్‌పాల్‌ సూచించారు. బుధవారం సంతోషపురంలో రైతులకు యూరియా వాడకంపై అవగాహన కల్పించారు. ఖరీఫ్‌ వరికి సంబంధించి మోతాదుకు మించి యూరియా వాడితే తెగుళ్లు అధికమవుతాయన్నారు. నానో యూరియాపై దృష్టి సారించాలని సూచించారు. ప్రకృతి సాగు విధానాల వల్ల తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు సాధించొచ్చని వెల్లడించారు. రసాయనిక ఎరువులకు బదులుగా అందుబాటులో ఉండే సహజ సిద్ధ వనాలను ఉపయోగించాలన్నారు. జిల్లాలో 1192 టన్నుల డీఏపీ, 1279 టన్నుల కాంప్లెక్స్‌ ఎరువులు, 670 టన్నుల పొటాష్‌, 888 టన్నుల సూపర్‌ పాస్పేట్‌, 1177 మెట్రిక్‌ టన్నుల యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయన్నారు.

Updated Date - Sep 11 , 2025 | 12:06 AM