Share News

పీఆర్సీ ప్రకటించాలి

ABN , Publish Date - Sep 09 , 2025 | 12:03 AM

రాష్ట్ర ప్రభుత్వం 12వ పీఆర్సీని వెంటనే ప్రకటిం చాలని, మేనిఫేస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం కాంట్రాక్ట్‌, అవుట్‌సోర్సింగ్‌ కార్మికులను వెంటనే పర్మినెంట్‌ చేయాలని కాంట్రాక్ట్‌, అవుట్‌సోర్సింగ్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ గౌరవాధ్యక్షుడు రామ్మూర్తినాయుడు డిమాండ్‌ చేశారు.

 పీఆర్సీ ప్రకటించాలి

రాజాం రూరల్‌, సెప్టెంబరు8 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం 12వ పీఆర్సీని వెంటనే ప్రకటిం చాలని, మేనిఫేస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం కాంట్రాక్ట్‌, అవుట్‌సోర్సింగ్‌ కార్మికులను వెంటనే పర్మినెంట్‌ చేయాలని కాంట్రాక్ట్‌, అవుట్‌సోర్సింగ్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ గౌరవాధ్యక్షుడు రామ్మూర్తినాయుడు డిమాండ్‌ చేశారు. సోమవారం స్థానిక మున్సిపల్‌ కార్యాలయం ప్రాంగణం లో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది న్నర కావస్తున్నా మేనిఫెస్టోలో ప్రకటించిన హామీలను అమలు చేయలేదని ఆరోపించారు. సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించి పర్మినెంట్‌ చేసే అంశంపై ప్రభుత్వం దృష్టి సారించకపోవడం దారుణ మన్నారు. అంగన్‌వాడీ, ఆశా కార్యకర్తల మాదిరిగా ఉద్యోగ విరమణ వయస్సును అవుట్‌సోర్సింగ్‌ కార్మికుల కు కూడా 62 ఏళ్లకు పెంచాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఈ సమావేశంలో పలువురు యూనియన్‌ నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Sep 09 , 2025 | 12:03 AM