పీఆర్సీని తక్షణమే నియమించాలి
ABN , Publish Date - Mar 14 , 2025 | 12:32 AM
పీఆర్సీని తక్షణమే నియమించాలని, ఐఆర్, డీఆర్ వెంటనే ప్రకటించాలని, బకాయిలన్నిటినీ పూర్తిగా క్లియర్ చేయాలని, హెల్త్ కార్డులపై వైద్యసేవలను అందించాలని రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్రం ఉపాఽధ్యక్షుడు రౌతు రామ్మూర్తి డిమాండ్‌చేశారు

బొబ్బిలి, మార్చి 13 (ఆంధ్రజ్యోతి): పీఆర్సీని తక్షణమే నియమించాలని, ఐఆర్, డీఆర్ వెంటనే ప్రకటించాలని, బకాయిలన్నిటినీ పూర్తిగా క్లియర్ చేయాలని, హెల్త్ కార్డులపై వైద్యసేవలను అందించాలని రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్రం ఉపాఽధ్యక్షుడు రౌతు రామ్మూర్తి డిమాండ్‌చేశారు. గురువారం స్ధానిక పెన్షనర్ల సంఘం కార్యాలయంలో సంఘం ప్రతినిధుల ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలకు సంబంధించి ఆందోళన కార్యక్రమాలు ఈనెల 17న చేపడుతున్నట్లు తెలిపారు. నిరసన కార్యక్రమానికి రాష్ట్ర సంఘం అధ్యక్షుడు పీఎస్‌ఎస్‌ఎన్‌పి శాస్ర్తి, జనరల్ సెక్రటరీ ఐ.లక్ష్మీనారాయణ, నాగరాజులు నాయకత్వం వహిస్తారన్నారు. అనంతరం జిల్లా స్థాయి సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. సమావేశంలో సంఘం నాయకులు లచ్చుపతుల జగన్నాథం, పోల సత్యంనాయుడు, బొత్స సత్యనారాయణ, చుక్క శ్రీరామ్మూర్తి పాల్గొన్నారు