Share News

పీఆర్సీని నియమించాలి

ABN , Publish Date - Mar 16 , 2025 | 11:34 PM

పీఆర్సీని తక్షణమే నియమించాలని రిటైర్డ్‌ ప్రభుత్వోద్యోగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రౌతు రామ్మూర్తి కోరారు.

 పీఆర్సీని నియమించాలి
మాట్లాడుతున్న ప్రభుత్వ రిటైర్డ్‌ ఉద్యోగుల సంఘం నాయకులు

బొబ్బిలి, మార్చి 16 (ఆంధ్రజ్యోతి): పీఆర్సీని తక్షణమే నియమించాలని రిటైర్డ్‌ ప్రభుత్వోద్యోగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రౌతు రామ్మూర్తి కోరారు. ఆదివారం స్థానిక పెన్షనర్లసంఘం కార్యాలయంలో సంఘంప్రతినిధుల సమా వేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా రిటైర్డ్‌ ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై సోమవారం తహసీల్దారు కార్యాల యాలఎదుట ధర్నాలు నిర్వహించి వినతిపత్రాలు సమర్పిస్తామన్నారు. బొబ్బిలి లో రాష్ట్రనేతల సారథ్యంలో ఆర్డీవోకు వినతిపత్రం అందజేస్తామని తెలిపారు. తమ సంక్షేమం, హక్కుల పట్ల గతప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహించిందని ఆరోపించారు. టీడీపీ ప్రభుత్వంలో తమ సమస్యలు పరిష్కారమవుతాయని ఆశించామన్నారు. ఐఆర్‌, డీఆర్‌ ప్రకటించాలని, బకాయిలు క్లియర్‌ చేయాలని, హెల్త్‌ కార్డులపై వైద్యసేవలను అందించాలని కోరారు. బొబ్బిలిలో సోమవారం జిల్లా స్ధాయి సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. సమావేశంలో సంఘం నాయకులు లచ్చుపతుల జగన్నాథం, పోల సత్యంనాయుడు, బొత్స సత్యనా రాయణ, చుక్క శ్రీరామ్మూర్తి పాల్గొన్నారు.

Updated Date - Mar 16 , 2025 | 11:34 PM