ప్రజా సమస్యల పరిష్కారానికే ప్రజాదర్బార్: మంత్రి
ABN , Publish Date - Jun 28 , 2025 | 12:27 AM
ప్రజా సమస్యల పరిష్కారానికే ప్రజాదర్బార్ నిర్వహిస్తున్నామని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు.
సాలూరు, జూన్ 27 (ఆంధ్రజ్యోతి): ప్రజా సమస్యల పరిష్కారానికే ప్రజాదర్బార్ నిర్వహిస్తున్నామని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. సాలూరులోని తన నివాసం వద్ద శుక్రవారం ఆమె ప్రజా దర్బార్ నిర్వహిం చారు. మున్సిపాల్టీలో ఎన్నో ఏళ్లగా విధులు నిర్వహిస్తున్న తమకు జీతాలు పెంచాలని మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగం కార్మికులు మంత్రిని కలిసి, వినతిపత్రం సమ ర్పించారు. కొంతమంది వివిధ వ్యక్తిగత సమస్యలను ఆమె దృష్టికి తీసుకువెళ్లారు.