సమస్యల పరిష్కారానికే ప్రజాదర్బార్
ABN , Publish Date - May 25 , 2025 | 12:07 AM
ప్రజా సమస్య ల పరిష్కారానికే ప్రజాదర్బార్ నిర్వహిస్తున్నామని ప్రభుత్వ విప్, కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి అన్నారు.
ప్రభుత్వ విప్ జగదీశ్వరి
గుమ్మలక్ష్మీపురం, మే 24 (ఆంధ్రజ్యో తి): ప్రజా సమస్య ల పరిష్కారానికే ప్రజాదర్బార్ నిర్వహిస్తున్నామని ప్రభుత్వ విప్, కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి అన్నారు. శనివారం గుమ్మలక్ష్మీపురంలోని తన క్యాంప్ కార్యాలయంలో ఆమె ప్రజాదర్బార్ నిర్వహించారు. నియోజక వర్గంలో పలు గ్రామాల నుంచి వచ్చిన ప్రజల నుంచి వినతులను స్వీక రించారు. సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడి పలు సమస్యలను పరిష్కరించారు. మిగతా కొన్ని వినతులను సంబంధిత శాఖ వారికి బదిలీ చేసి, పరిష్కారం అయ్యే విధంగా చర్యలు చేపట్టాలని సూచించారు.