కొత్త కలెక్టర్‌గా ప్రభాకర్‌రెడ్డి
ABN , Publish Date - Sep 11 , 2025 | 11:38 PM
కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో సీసీఎల్‌ఏలో విధులు నిర్వహిస్తున్న ఎన్.ప్రభాకర్‌రెడ్డిని ప్రభుత్వం నియమించింది.
పార్వతీపురం, సెప్టెంబరు 11 (ఆంధ్రజ్యో తి): కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో సీసీఎల్‌ఏలో విధులు నిర్వహిస్తున్న ఎన్.ప్రభాకర్‌రెడ్డిని ప్రభుత్వం నియమించింది. పార్వతీపురం మన్యం జిల్లా ఏర్పడిన తరువాత రెండో కలెక్టర్‌గా శ్యామ్‌ప్ర సాద్ వచ్చారు. విద్య, వైద్యం, రహదారులు తదితర మౌలిక వసతుల కల్పనపై యన ప్రత్యేక దృష్టిసారించారు. గిరిజన గ్రామాల్లో పర్యటించడంతో పాటు ప్రజలు ఎదుర్కొం టున్న సమస్యలను పరిష్కరించారు. కంటైనర్ ఆసుపత్రులు, నిత్యావసర సరుకులు సరఫరా కోసం ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేయ డంలో కీలకంగా వ్యవహరించారు.
జిల్లా మూడో కలెక్టర్‌గా ప్రభాకర్‌రెడ్డి త్వరలో బాధ్యతలు స్వీకరించనున్నారు. 2013 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన ఈయన ప్రస్తుతం సీసీఎల్‌ఏలో జాయింట్ సెక్రటరీగా విధులు నిర్వహిస్తున్నారు. ప్రభాకర్‌రెడ్డిది సాధారణ రైతు కుటుంబం. బిజినెస్ అడ్మినిస్ర్టేటివ్ ఫిలాసఫీతో పాటు గణితంలో పీహెచ్‌డీ, సైన్స్, ఆర్ట్స్‌లో మాస్టర్స్ డిగ్రీలు పొందారు. గతంలో భూ పరిపాలన అదనపు కమిషనర్, సర్వే సెటిల్‌మెంట్, ల్యాండ్ రికార్డర్‌గా, ఆంధ్రప్రదేశ్ క్రీడాభివృద్ధి సంస్థ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా ఆయన విధులు నిర్వహించారు. కడప, ఆదోనీలో ఆర్డీవోగా పనిచేసిన సమ యంలో బ్యాల వివాహాల నివారణ, యువత సాధికారితకు చేసిన కృషికి గాను ఆయన 2013లో గవర్నర్ ఎస్.ఎల్.నరసింహ చేతుల మీదుగా బంగారు పతకం అందుకున్నారు. సీఆర్‌డీఏలో డైరెక్టర్‌గా అమరావతి భూసేకరణ పథకం అమల్లో కీలకపాత్ర పోషించారు. రాష్ట్రవ్యాప్తంగా ఈవోఆర్‌ఎస్ నెట్‌వర్క్ ఏర్పాటు చేసి, దేశంలోనే మొదటిసారి ఈ ప్రాజెక్టును ఆయన విజయవంతం చేశారు. నెల్లూరు జాయింట్ కలెక్టర్‌గా బాఽధ్యతలు నిర్వహించేట ప్పుడు 32 బాల్య వివాహాలను అడ్డుకున్నారు. జిల్లా కలెక్టర్‌గా శనివారం విధుల్లో చేరను న్నట్లు సమాచారం.