Share News

పీఆర్‌ రోడ్లపై నివేదిక ఇవ్వాలి

ABN , Publish Date - Nov 11 , 2025 | 11:48 PM

జిల్లాలోని పంచా యతీరాజ్‌ రహదారులపై వారంరోజుల్లో సమగ్ర నివేదికను ఇవ్వాలని కలెక్టర్‌ రామసుందర్‌ రెడ్డి ఆదేశించారు. మంగళవారం రాత్రి కలెక్టరేట్‌ ఆడిటోరియంలో ఇంజనీరింగ్‌ అధికారులతో సమీక్షించారు.

 పీఆర్‌ రోడ్లపై నివేదిక ఇవ్వాలి
మాట్లాడుతున్న కలెక్టరు రామసుందర్‌ రెడ్డి :

విజయనగరం కలెక్టరేట్‌, నవంబరు 11(ఆంధ్రజ్యోతి) జిల్లాలోని పంచా యతీరాజ్‌ రహదారులపై వారంరోజుల్లో సమగ్ర నివేదికను ఇవ్వాలని కలెక్టర్‌ రామసుందర్‌ రెడ్డి ఆదేశించారు. మంగళవారం రాత్రి కలెక్టరేట్‌ ఆడిటోరియంలో ఇంజనీరింగ్‌ అధికారులతో సమీక్షించారు. ఈసందర్భం గా మాట్లాడుతూ పీఆర్‌ పరిధిలోని సీసీ,బీటీ, డబ్ల్యూబీఎం, మట్టిరోడ్లు స్థితి గతులపై సర్వేచేసి నివేదిక ఇవ్వాలని కోరారు. రోడ్ల పొడవు, వాటి పరిస్థితి చేయాల్సిన చిన్న, పెద్ద మరమ్మతులు, అయ్యేవ్యయం తదితర సమగ్ర వివ రాలను అందజేయాలని తెలిపారు. కుళాయిలు ద్వారా సురక్షత తాగునీటిని సరఫరా చేయాలని ఆదేశించారు.నిర్మాణంలో ఉన్న రహదారులు, తాగునీటి పఽథకాలను త్వరగా పూర్తి చేయాలని సూచించారు.సమావేశంలోని సీపీవో బాలాజీ, ఎస్‌ఈ శ్రీనివాసరావు, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈ కవిత పాల్గొన్నారు.

రోడ్లపై చెత్త వేస్తే జరిమానా

ఇస్టానుసారంగా రోడ్ల పక్కన చెత్తవేసే వారిపై కఠినచర్యలు తీసు కోవా లని కలెక్టర్‌ రామసుందర్‌ రెడ్డి ఆదేశించారు.చెత్త వేసేవారిపై సమీపంలో ఉన్న సీసీ కెమెరాలు ద్వారా గుర్తించాలని సూచించారు. చెత్త వేసినట్లు నిర్ధారణ అయినవారికి రూ.లక్షకు తక్కువ కాకుండా జరిమాన విధించాలని ఆదేశించారు. కలెక్టరేట్‌లో నగర, పురపాలక సంస్థలు, నగర పంచాయతీల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చెత్తను రోడ్ల పక్కన పడేయడం వల్ల పర్యావరణానికి నష్టం కలగడమే కాకుండా, వాహనచోదకులకు ఇబ్బందికలుగుతుందని తెలిపారు. పారిశుధ్య సిబ్బంది కూడా దీనిపై నిఘా పెట్టాలని సూచించారు. ప్రజలకు సురక్షిత తాగునీటి అందజేయాలని కోరారు. రీసైక్లింగ్‌ చేసిదాని నిర్వహణకు అవసర మైన ఆదాయాన్ని సంపాదించాలని సూ చించారు.మురుగునీటి నిర్వహణ కోసం ఎస్టీపీ ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని తెలిపారు. అన్నా క్యాంటీన్లు నిర్వహణ మరింత మెరుగ్గా ఉండాలని చెప్పారు. సమావేశంలో సీపీవో బాలాజీ, పబ్లిక్‌ హెల్త్‌ ఈఈ జ్యోతి, మునిసిపల్‌ కమిష నర్లు నల్లనయ్య, అప్పలరాజు, రామలక్ష్మి, శ్రీనివాసరావు, జయరాం పాల్గొన్నారు.

Updated Date - Nov 11 , 2025 | 11:48 PM