చెట్లు కూలడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం
ABN , Publish Date - Oct 08 , 2025 | 12:00 AM
రాజాంవ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయం ఆవరణలో విద్యుత్ వైర్లపై మూడు చెట్లు మంగళవారం మధ్యా హ్నం కూలిపోయాయి.దీంతో మధ్యాహ్నం విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది.బొబ్బిలి రోడ్డులోని గోపాలపురం సబ్‌స్టేషన్ నుంచి వస్త్రపురి కాలనీ, కంచరాం,రాజీయ్యపేట, ఆగూరు, అమరాం, దోసరి,రామినాయుడు వలస తది తర గ్రామాలకు విద్యుత్ సరఫరాచేస్తున్నారు.
రాజాం, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి):రాజాంవ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయం ఆవరణలో విద్యుత్ వైర్లపై మూడు చెట్లు మంగళవారం మధ్యా హ్నం కూలిపోయాయి.దీంతో మధ్యాహ్నం విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది.బొబ్బిలి రోడ్డులోని గోపాలపురం సబ్‌స్టేషన్ నుంచి వస్త్రపురి కాలనీ, కంచరాం,రాజీయ్యపేట, ఆగూరు, అమరాం, దోసరి,రామినాయుడు వలస తది తర గ్రామాలకు విద్యుత్ సరఫరాచేస్తున్నారు.మధ్యాహ్నం కురిసిన వర్షానికి గాలులు వీయడంతో వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలో విద్యుత్ వైర్లపై మూడుచెట్లు విరిగిపడటంతో ఐదు గంటలపాటు విద్యుత్ సరఫరా నిలిచి పోయింది.విద్యుత్ సిబ్బంది చెట్లను తొలగించి సరఫరా పునరుద్ధరించి నా లోవొల్టేజ్ సమస్య వల్ల వినియోగదారులు ఇబ్బందులకు గురయ్యారు. కాగా చెట్లు విరిగిపడి వైర్లపై పడడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగిం దని ట్రాన్స్‌కో ఏఈ కుమార్ తెలిపారు. వైర్లు సరిచేయడంలో జాప్యం కావ డంతో ఇబ్బందులుఏర్పడ్డాయని, సిబ్బంది దగ్గరుండి చెట్లును తొలగించి వైర్లు సరిచేసి విద్యుత్ సరఫరా పునరుద్ధరించారని చెప్పారు.