Share News

గాలి వీస్తే విద్యుత్‌ కట్‌

ABN , Publish Date - May 04 , 2025 | 12:08 AM

మండలంలో ఏ మాత్రం వాతావరణం మారి చిన్న గాలి వీచినా విద్యుత్‌ సరఫరాను నిలిపివేస్తున్నారు.

గాలి వీస్తే విద్యుత్‌ కట్‌

  • భామినిలో నిత్యం అంధకారం

భామిని, మే 3 (ఆంధ్రజ్యోతి): మండలంలో ఏ మాత్రం వాతావరణం మారి చిన్న గాలి వీచినా విద్యుత్‌ సరఫరాను నిలిపివేస్తున్నారు. దీంతో భామిని లో నిత్యం అంధకారం నెలకొంటుంది. శనివారం సాయంత్రం 4 గంటలకు చిరుగాలులు వేయడంతో విద్యుత్‌కు అంతరాయం ఏర్పడింది. రాత్రి 8 గంటల వరకు పవర్‌ ఇవ్వలేదు. దీంతో చీకట్లు అలముకు న్నాయి. తహసీల్దార్‌ కార్యాలయంలో సెల్‌ఫోన్‌ టార్చ్‌ వెలుతురులో తహసీల్దార్‌ రికార్డులు పరిశీలించారు. గురువారం రాత్రి 8.30 గంటలకు వర్షం పడడంతో ఆ రోజు రాత్రంతా విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. రోజు విడిచి రోజు వాతావరణం పేరిట విద్యుత్‌ను నిలిపి వేస్తుండడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. శనివారం జరిగిన అంతరాయంపై ట్రాన్స్‌ ఏఈ శ్రీనివాసరావు వద్ద ప్రస్తావించగా.. గాలికి అనంతగిరి సమీపంలో 33 కేవీ విద్యుత్‌ లైన్లపై వెదురు కర్రలుపడిపోయాయని, తొలగించిన వెంటనే విద్యుత్‌ సరఫరా చేసినట్లు తెలిపారు.

Updated Date - May 04 , 2025 | 12:08 AM