Share News

Power Dues విద్యుత్‌ బకాయిలు రూ.11 కోట్లు

ABN , Publish Date - Dec 30 , 2025 | 11:27 PM

Power Dues Touch ₹11 Crore జిల్లాలోని పలు పంచాయతీల్లో విద్యుత్‌ బకాయిలు కొండలా పేరుకుపోయాయి. సుమారు రూ.పదకొండు కోట్లకు పైబడి బకాయిలు ఉన్నాయి. దశాబ్దాలు గడుస్తున్నా అవి వసూలు కావడం లేదు. దీంతో ట్రాన్స్‌కో సూపరింటెండెంట్‌ ఇంజనీర్‌ మల్లికార్జునరావు మంగళవారం జిల్లా పంచాయతీ అధికారి కొండలరావును కలిసి నోటీసు అందించారు.

Power Dues   విద్యుత్‌ బకాయిలు రూ.11 కోట్లు
డీపీవోకు బకాయిలు జాబితా అందిస్తున్న ట్రాన్స్‌ కో ఎస్‌ఈ

  • నోటీసు ఇచ్చిన విద్యుత్‌ శాఖ

పార్వతీపురం, డిసెంబరు30(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని పలు పంచాయతీల్లో విద్యుత్‌ బకాయిలు కొండలా పేరుకుపోయాయి. సుమారు రూ.పదకొండు కోట్లకు పైబడి బకాయిలు ఉన్నాయి. దశాబ్దాలు గడుస్తున్నా అవి వసూలు కావడం లేదు. దీంతో ట్రాన్స్‌కో సూపరింటెండెంట్‌ ఇంజనీర్‌ మల్లికార్జునరావు మంగళవారం జిల్లా పంచాయతీ అధికారి కొండలరావును కలిసి నోటీసు అందించారు. తక్షణమే బిల్లులు చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.

బకాయిలు ఇలా..

జిల్లాలో బలిజిపేట మండలం నుంచి రూ. 1.50కోట్లు , భామిని రూ.41.81లక్షలు, గరుగుబిల్లి రూ.26.25 లక్షలు, గుమ్మలక్ష్మీపురం రూ.92.56 లక్షలు, జియ్యమ్మవలస రూ.42.17 లక్షలు, కొమరాడ రూ.18.95 లక్షల వరకు విద్యుత్‌ బకాయిలు ఉన్నాయి. కురుపాం రూ.1.35 కోట్లు, మక్కువ రూ. 1.08 కోట్లు, పాచిపెంట రూ.70 లక్షలు, పాలకొండ రూ.47.84 లక్షలు, సాలూరు రూ.57 లక్షలు, సీతంపేట రూ. 1.70 కోట్లు, సీతానగరం రూ.68 లక్షలు, వీరఘట్టం రూ.45 లక్షలు , పార్వతీపురం మండలం నర్సిపురం నుంచి రూ.29 లక్షల వరకు ట్రాన్స్‌కోకు చెల్లించాల్సి ఉంది. వచ్చే ఏడాదితో ఫిబ్రవరితో ప్రస్తుతం ఉన్న పంచాయతీల పాలకవర్గాల పదవీకాలం ముగియనుంది. ఈలోపుగా బిల్లులు చెల్లిస్తారా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. కాగా ఎన్నికలు జరిగిన తర్వాత కొత్తగా కొలువుదీరే పంచాయతీల పాలకవర్గంపై కూడా ఈ విద్యుత్‌ బకాయిల భారం పడనుంది.

Updated Date - Dec 30 , 2025 | 11:27 PM