Share News

పోస్టల్‌ సేవల పరిశీలన

ABN , Publish Date - Apr 25 , 2025 | 11:58 PM

ఎయిర్‌ పోర్టుకు భోగాపురం పోస్టాఫీసుకు దూరం, ప్రయాణం, పోస్టల్‌ సేవలు, తదితర విష యాలను ఆంధ్రప్రదేశ్‌ పోస్టల్‌ శాఖ చీఫ్‌ పోస్టు మాస్టర్‌ జనరల్‌ కె.ప్రకాశ్‌ పరిశీలించారు. ఎయిర్‌ పోర్టు నిర్మాణం జరుగుతుండడంతో ఈ ప్రాంతంలో జాతీయ, అంతర్జాతీయంగా పోస్టల్‌ సేవలందించేలా చర్యలు చేపట్టే విధంగా ఉండేందుకు శుక్రవారం ప్రకాశ్‌ పర్యటించారు. తొలుత భోగాపురం సబ్‌పోస్టు ఆఫీసును పరిశీలించారు.

పోస్టల్‌ సేవల పరిశీలన
ఎయిర్‌పోర్టు నిర్మాణ ప్రాంతాన్ని పరిశీలిస్తున్న ప్రకాశ్‌ :

భోగాపురం, ఏప్రిల్‌ 25 (ఆంధ్రజ్యోతి): ఎయిర్‌ పోర్టుకు భోగాపురం పోస్టాఫీసుకు దూరం, ప్రయాణం, పోస్టల్‌ సేవలు, తదితర విష యాలను ఆంధ్రప్రదేశ్‌ పోస్టల్‌ శాఖ చీఫ్‌ పోస్టు మాస్టర్‌ జనరల్‌ కె.ప్రకాశ్‌ పరిశీలించారు. ఎయిర్‌ పోర్టు నిర్మాణం జరుగుతుండడంతో ఈ ప్రాంతంలో జాతీయ, అంతర్జాతీయంగా పోస్టల్‌ సేవలందించేలా చర్యలు చేపట్టే విధంగా ఉండేందుకు శుక్రవారం ప్రకాశ్‌ పర్యటించారు. తొలుత భోగాపురం సబ్‌పోస్టు ఆఫీసును పరిశీలించారు. ఇక్కడ పోస్టల్‌ సేవలు వినియోగం, వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకొన్నారు.అనంతరం మండల కార్యాలయాల కూడలిలో పోస్టాఫీసుకు కేటా యించిన స్థలాన్ని,ఎయిర్‌పోర్టు ప్రాంతాన్ని పరిశీలించారు.పోస్టల్‌ శాఖ ఉద్యోగులకు పలు సూచనలుచేశారు. కార్యక్రమంలో పోస్టల్‌ శాఖ జిల్లా సూపరింటెండెంట్‌ కొల్లూరు శ్రీనివాసులు, ఏఏసీవోలు కె.మధుసూదనరావు, పి.సుందరనాయుడు, సబ్‌పోస్టుమాస్టర్‌ పప్పల శ్రీనివాస్‌, ఏపీఎం జి.రవి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 25 , 2025 | 11:58 PM