Share News

పాఠశాల స్థలం స్వాధీనం

ABN , Publish Date - May 19 , 2025 | 12:26 AM

పి.వెంకం పేట గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల స్థలం గత కొన్నేళ్లుగా వైసీపీకి చెందిన ఓ వ్యక్తి ఆధీనంలో ఉండేది.

 పాఠశాల స్థలం స్వాధీనం
బుడా చైర్మన్‌ తెంటు బ్యాంటింగ్‌ చేస్తుండగా ఎమ్మెల్యే బేబీనాయన వికెట్‌ కీపింగ్‌ చేస్తున్న దృశ్యం

  • పి.వెంకంపేట గ్రామస్థుల హర్షం

బాడంగి, మే 18 (ఆంధ్రజ్యోతి): పి.వెంకం పేట గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల స్థలం గత కొన్నేళ్లుగా వైసీపీకి చెందిన ఓ వ్యక్తి ఆధీనంలో ఉండేది. దీనిపై గ్రామస్థులు పలుమార్లు అధికారుల కు విన్నవించినా ఫలితం లేకపోయింది. ఈ విషయాన్ని స్థానిక టీడీపీ నాయకులు బుడా చైర్మన్‌ తెంటు లక్ష్ముంనాయుడు దృష్టికి తీసుకువెళ్లారు. ఆయన ఎమ్మెల్యే బేబీనాయనకు చెప్పారు. దీంతో ఎమ్మెల్యే కలెక్టర్‌తో మాట్లాడి, ప్రైవేటు వ్యక్తి చేతిలో ఉన్న స్థలాన్ని ఆదివారం స్వాధీ నం చేసుకుని, గ్రామస్థులు అప్పగించారు. దీం తో గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆ పాఠశాల స్థలాన్ని క్రీడా స్థలంగా మార్చి ఆదివారం వివిధ క్రీడా పోటీలు నిర్వ హించారు. ఈ పోటీలకు ఎమ్మెల్యేతో పాటు బుడా చైర్మన్‌ను ఆహ్వానించారు. ఈ మేరకు వారు క్రీడల్లో పాల్గొన్నారు. బుడా చైర్మన్‌ బ్యాటింగ్‌ చేయగా ఎమ్మెల్యే వికెట్‌ కీపింగ్‌ చేసి పిల్లలతో కలిసి ఆటలాడారు. ఈసందర్భంగా వారు మా ట్లాడుతూ వైసీపీ నాయకుడు కబ్జా చేసుకున్న స్థలాన్ని తిరిగి స్వాధీనం చేసుకుని పాఠశాలకు అప్పగించడం ఆనందంగా ఉందని అన్నారు. ఈ మైదానాన్ని పిల్లలతోపాటు యు వకులు వినియోగించుకోవాలన్నారు. ఈ కార్యక్ర మంలో స్థానిక టీడీపీ అధ్యక్షుడు తెంటు రవి, లచ్చుపతుల సత్యం తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 19 , 2025 | 12:26 AM