మత్తు పదార్థాల స్వాధీనం
ABN , Publish Date - Jul 09 , 2025 | 12:04 AM
జిల్లాలోని పలుచోట్ల దుకాణాల్లో ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్ కార్యక్రమంలో భాగంగా మంగళవారం పోలీసులు తనిఖీలు నిర్వహించారు.ఈ సందర్భంగా నిషేధిత మత్తుపదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.
జిల్లాలోని పలుచోట్ల దుకాణాల్లో ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్ కార్యక్రమంలో భాగంగా మంగళవారం పోలీసులు తనిఖీలు నిర్వహించారు.ఈ సందర్భంగా నిషేధిత మత్తుపదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.
రాజాం రూరల్, జూలై 8 (ఆంరఽధజ్యోతి):రాజాంలోని పలు పాన్‌షాపుల్లో డీఎస్పీ రాఘవులు సారధ్యంలో టౌన్ సీఐ అశోక్‌కుమార్ సిబ్బందితో తనిఖీలు నిర్వహించారు.ఈసందర్భంగా పొగాకు ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నారు.
ఫగజపతినగరం, జూలై8(ఆంధ్రజ్యోతి):గజపతినగరంలోని ప్రభుత్వ డిగ్రీ, జూనియర్ కళాశాలల ప్రాంగణాల్లో గల పాన్‌షాపులపై సీఐ జీఏవీ రమణ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా మూడు షాపుల్లో సిగరెట్ల అమ్మకాలు చేపట్టినట్లు గుర్తించి కోప్టా యాక్టు కింద అపరాద రుసుము విధించి నట్లు పోలీసులు తెలిపారు. కార్యక్రమంలో ఎస్‌ఐ కేకేకే నాయుడు, ఎన్‌ఎస్‌ఎస్ యూనిట్ ప్రోగ్రాం అధికారి సన్యాసిరావు, రమేష్ కుమార్ పాల్గొన్నారు.
ఫచీపురుపల్లి, జులై 8(ఆంధ్రజ్యోతి):పాన్ షాపులు, కిరాణ దుకాణాల వర్తకులు వ్యాపార నిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ ఎస్. రాఘవులు హెచ్చరించారు. చీపురుపల్లిలో విద్యాసంస్థలకు వంద మీటర్ల దూరంలో ఉన్న ల దుకాణాలను ఎస్‌ఐ ఎల్.దామోదరరావుతో కలిసి తనిఖీ చేశారు.
ఫగుర్ల, జూలై 8(ఆంధ్రజ్యోతి): గుర్లలోని స్కూళ్లు, కాలేజీలకు వంద మీటర్ల దూరంలో ఉన్న పాన్‌షాపులను పోలీసులు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సిగిరెట్స్, బీడీలు, చుట్టలు విక్రయించిన వారికి అవగాహన కల్పిస్తూ ఫైన్ వేశారు.
ఫరేగిడి, జూలై 8(ఆంధ్రజ్యోతి): మండలంలోని ఉంగరాడమెట్టలో గల షాపుల్లో మాదకద్రవ్యాలు, టుబాకా వినియోగం, నిల్వలపై ఎస్‌ఐ నీలావతి, సిబ్బందితో తనిఖీలు నిర్వహించారు. దుకాణాలు, స్టాక్‌రూమ్‌లు పరిశీలించి, మాదకద్రవ్యాల వినియోగం, చట్టపరమైన చర్యలపై దుకాణదారులకు అవగాహన కల్పించారు.