గంజాయి స్వాధీనం
ABN , Publish Date - Aug 27 , 2025 | 12:22 AM
పొనుగుటివలస జంక్షన్ వద్ద స్థానిక పోలీసులు గంజాయి ముఠాను పట్టుకున్నారు.
సంతకవిటి, ఆగస్టు 26(ఆంధ్రజ్యోతి): పొనుగుటివలస జంక్షన్ వద్ద స్థానిక పోలీసులు గంజాయి ముఠాను పట్టుకున్నారు. స్థానిక ప్రైవేటు కళాశాల ఎదురు గా ఉన్న మామిడితోటలో 4.8 కిలోల గంజాయి సరఫరా చేస్తున్న నలుగురు వ్యక్తులను గుర్తించి, అదుపులోకి తీసుకున్నారు. నిందితులు పాలకొండ ప్రాంతా నికి చెందిన బి.దుర్గాప్రసాద్, షేక్ రఫీ, కె.ఉదయ్, ఎ.చంద్రశేఖర్‌లుగా పోలీసు లు తెలిపారు. సోమవారం సాయంత్రం అరెస్టు చేసిన పోలీసులు.. మంగళవా రం రిమాండ్ నిమిత్తం పాలకొండ కోర్టుకు తరలించారు.
సాలూరులో..
సాలూరు, ఆగస్టు 26 (ఆంధ్రజ్యోతి): పట్టణంలోని ఓల్డ్ బీఎస్‌ఎన్‌ఎల్ ఆఫీసు రోడ్డులో అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఇద్దరు వ్యక్తుల నుంచి గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ బి.అప్పలనాయుడు తెలిపారు. మంగళవారం సాలూరులో విలేకరులతో మాట్లాడుతూ ఓల్డ్ బీఎస్ ఎన్‌ఎల్ ఆఫీసు రోడ్డులో అనుమానాస్పదంగా ఇద్దరు వ్యక్తులు సంచరిస్తున్నట్లు సమాచారం వచ్చిందని తెలిపారు. వారిని అదుపులోకి తీసుకుని విచారించగా తెలంగాణ, ఒడిశా రాష్ట్రాలకు చెందిన వారిగా గుర్తించినట్లు చెప్పారు. వారి వద్ద ఉన్న బ్యాగుల్లో 5.60 కేజీల గంజాయి ప్యాకెట్లు లభ్యమయ్యాయని, మల్కనగిరి నుంచి తెలంగాణకు గంజాయిని తరలిస్తున్నట్లు తెలిపారు. వీరిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు చెప్పారు.