Share News

గంజాయి స్వాధీనం

ABN , Publish Date - Jul 30 , 2025 | 12:10 AM

మండలంలోని బొడ్డవర చెక్‌పోస్టు వద్ద సోమవారం అర్ధరాత్రి విశాఖ మన్యం నుంచి కేరళకు వెళ్తున్న వ్యానులో తరలిస్తున్న గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

 గంజాయి స్వాధీనం

ఎస్‌.కోట రూరల్‌, జూలై 29(ఆంధ్రజ్యోతి): మండలంలోని బొడ్డవర చెక్‌పోస్టు వద్ద సోమవారం అర్ధరాత్రి విశాఖ మన్యం నుంచి కేరళకు వెళ్తున్న వ్యానులో తరలిస్తున్న గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులకు ముం దుగా వచ్చిన సమాచారం మేరకు చెక్‌బోస్టు వద్ద మాటువేశారు. ఆ సమయం లో వచ్చిన ఓ వ్యానును ఆపి, తనిఖీ చేశారు. ఇందులో పెద్ద మొత్తంలో గంజాయిని గుర్తించి, స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.

Updated Date - Jul 30 , 2025 | 12:10 AM