పొజిషన్ సర్టిఫికెట్లు మంజూరు చేయాలి
ABN , Publish Date - Mar 11 , 2025 | 12:23 AM
): పీఎం జన్మన్ గృహాలు నిర్మించేం దుకు పొజిషన్ సర్టి ఫికెట్లు మంజూరు చేయాలని ఆదివాసీ గిరిజనులు కోరారు. ఈమేరకు సోమవా రం తహసీల్దార్ ఎన్.అప్పారావుకు వినతిప త్రం అందజేశారు.

భామిని, మార్చి 10 (ఆంధ్రజ్యోతి): పీఎం జన్మన్ గృహాలు నిర్మించేం దుకు పొజిషన్ సర్టి ఫికెట్లు మంజూరు చేయాలని ఆదివాసీ గిరిజనులు కోరారు. ఈమేరకు సోమవా రం తహసీల్దార్ ఎన్.అప్పారావుకు వినతిప త్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతై బూర్జిగూడ, కోటకొండ, కోసింగూడ, బండ్రసింగి, రేగిడి తదితర గ్రామాల ఆదివాసీలకు ఇళ్లు మంజూరైనా, పొజిషన్‌కు దరఖాస్తుచేస్తే ఇవ్వడం లేదని ఆందోళనవ్యక్తం చేశారు. కాగా ఈ మేరకు తహసీల్దార్ హౌసింగ్, రెవెన్యూ సిబ్బందితో సమీక్షించారు. ఫారెస్ట్, ఐటిడిఏ అధికారులతో మాట్లాడారు. ఆర్‌వోఎఫ్‌ఆర్ పరిధి ఉండడంతో హౌసింగ్ ద్వారా 44 మంది లబ్ధిదారుల జాబితా ఐటీడీఏకు పంపించామని, అనుమతి వచ్చిన వెంటనే పొజిషన్ ధ్రువపత్రాలు అందజేస్తామని తెలిపారు.