Polio Drops ప్రతి చిన్నారికీ పోలియో చుక్కలు
ABN , Publish Date - Dec 23 , 2025 | 12:25 AM
Polio Drops for Every Child ప్రతి చిన్నారికీ పోలియో చుక్కలు వేయాలని స్టేట్ అబ్జర్వర్ డాక్టర్ ప్రభావతి ఆదేశించారు. సోమవారం కూర్మరాజుపేట, బొడ్డవలస, మరిపిల్లి, తోణాంలో వైద్య సిబ్బంది నిర్వహించిన ఇంటింటి పల్స్‌పోలియో కార్యక్రమాన్ని పరిశీలించారు.
సాలూరు రూరల్, డిసెంబరు22(ఆంధ్రజ్యోతి): ప్రతి చిన్నారికీ పోలియో చుక్కలు వేయాలని స్టేట్ అబ్జర్వర్ డాక్టర్ ప్రభావతి ఆదేశించారు. సోమవారం కూర్మరాజుపేట, బొడ్డవలస, మరిపిల్లి, తోణాంలో వైద్య సిబ్బంది నిర్వహించిన ఇంటింటి పల్స్‌పోలియో కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పోలియో రహిత సమాజమే లక్ష్యంగా పనిచేయాలన్నారు. ఈ నేపథ్యంలో ఐదేళ్ల లోపు పిల్లలు ఎక్కడున్నా విధిగా పోలియో చుక్కలు వేయాలని సూచించారు. జిల్లాలో 99,507 మంది చిన్నారులకు గాను తొలిరోజు 84,610 మందికి , రెండో రోజు 2,240 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేసినట్లు నియోజకవర్గ వైద్యప్రోగ్రామ్ ఆఫీసర్ డి.శివకుమార్ తెలిపారు. ఈ కార్యక్రమం మంగళవారం సైతం కొనసాగించి, శతశాతం పూర్తికి కృషి చేస్తామన్నారు.