మైనింగ్ తవ్వకాలపై విధానాలు మార్చుకోవాలి
ABN , Publish Date - Sep 13 , 2025 | 11:59 PM
గిరిజన ప్రాంతాల్లో మైనింగ్ తవ్వ కాలకు రాష్ట్ర ప్రభుత్వం దూకుడుగా వ్యవహరిస్తోందని, ఇటువంటి విధానాలను మార్చుకోకపోతే భవిష్యత్తులో ఆందోళనలు చేస్తామని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీహెచ్ నరసింగరావు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే నిరంకుశ విధానాలు అవలంబిస్తున్నాయని ఆరోపించారు.
పాలకొండ, సెప్టెంబరు 13 (ఆంధ్రజ్యోతి): గిరిజన ప్రాంతాల్లో మైనింగ్ తవ్వ కాలకు రాష్ట్ర ప్రభుత్వం దూకుడుగా వ్యవహరిస్తోందని, ఇటువంటి విధానాలను మార్చుకోకపోతే భవిష్యత్తులో ఆందోళనలు చేస్తామని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీహెచ్ నరసింగరావు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే నిరంకుశ విధానాలు అవలంబిస్తున్నాయని ఆరోపించారు.శనివారం పాలకొండలో సీఐటీయూ పార్వతీపురంమన్యం జిల్లా 11వ మహాసభలు నిర్వహించారు. తొలుత కోటదుర్గమ్మ గుడి సెంటర్ నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు కార్మికులు ప్రదర్శన చేశారు. అనం తరం కామ్రేడ్ వీజీకేమూర్తి ప్రాంగణంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు దావాల రమణారావు అధ్యక్షతన నిర్వహించిన సభలో నరసింగరావు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల వేతనాలు పెంచకుండా కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ పద్ధతి లోనే నిర్వహిస్తున్నాయని ఆరోపించారు.రాష్ట్రంలో మూడు లక్షలకుపైగా ఔట్‌సోర్సిం గ్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్‌చేశారు.సభలో సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి కె.సుబ్బరావమ్మ, జిల్లా ప్రధాన కార్యదర్శి వై.మన్మఽథరావు, జిల్లా కార్యదర్శులు ఎన్.వై.నాయుడు, బీవీ రమణ, ఇంది ర, జిల్లా కోశాధికారి గొర్లె వెంకటరమణ పాల్గొన్నారు.