Share News

Police Raid పేకాట శిబిరంపై పోలీసుల దాడి

ABN , Publish Date - Jul 26 , 2025 | 11:57 PM

Police Raid on Gambling Den పార్వతీపురం మండలం అడ్డాపుశీల గ్రామ సమీపంలో పేకాట శిబిరంపై శనివారం సాయంత్రం రూరల్‌ పోలీసులు దాడులు చేశారు. 14 మందిని అరెస్ట్‌చేశారు. వారి నుంచి రూ.63,470 నగదు స్వాధీనం చేసుకున్నారు.

Police Raid  పేకాట శిబిరంపై పోలీసుల దాడి
పోలీసులు స్వాధీనం చేసుకున్న నగదుతో పాటు పేకలు

నిందితుల్లో టీడీపీ, వైసీపీ నాయకులు?

మరికొందరు ప్రముఖులు కూడా..!

పూర్తి వివరాలు వెల్లడించని వైనం

పార్వతీపురం రూరల్‌, జూలై 26(ఆంధ్రజ్యోతి): పార్వతీపురం మండలం అడ్డాపుశీల గ్రామ సమీపంలో పేకాట శిబిరంపై శనివారం సాయంత్రం రూరల్‌ పోలీసులు దాడులు చేశారు. 14 మందిని అరెస్ట్‌చేశారు. వారి నుంచి రూ.63,470 నగదు స్వాధీనం చేసుకున్నారు. దీనిపై రూరల్‌ ఎస్‌ఐ సంతోషి కేసు నమోదు చేశారు. అయితే ఆ ప్రాంతంలో ఉన్న ద్విచక్రవాహనాలు ఎవరెవరివి అన్నది తేలాల్సి ఉంది. కొన్ని మాయమైనట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి. అయితే ఈ పేకాట శిబిరంలో అధికార పార్టీకి చెందిన ఓ కౌన్సిలర్‌, అలాగే అడ్డాపుశీల గ్రామానికి చెందిన ఓ వైసీపీ నాయకుడు ఉన్నట్లు సమాచారం. వీరి పేర్లు వెల్లడించడంలో పోలీసులు మౌనం వహిస్తున్నారు. వారు అధికారికంగా ప్రకటించినప్పటికీ పేకాటలో మరికొందరు ప్రముఖులు కూడా ఉన్నట్టు సమాచారం.

Updated Date - Jul 26 , 2025 | 11:57 PM