Police సమాజ రక్షణలో పోలీసుల పాత్ర కీలకం
ABN , Publish Date - Oct 21 , 2025 | 11:38 PM
Police Play a Key Role in Protecting Society సమాజ రక్షణ, అంతర్గత భద్రతలో పోలీసుల పాత్ర కీలకమని ఎస్పీ ఎస్‌వీ మాధవరెడ్డి తెలిపారు. మంగళవారం పార్వతీపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో పోలీసు అమరవీరుల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా అమ రుల స్థూపం వద్ద ఘన నివాళి అర్పించారు.
పార్వతీపురంలో పోలీసు అమరవీరుల దినోత్సవం
బెలగాం, అక్టోబరు21(ఆంధ్రజ్యోతి): సమాజ రక్షణ, అంతర్గత భద్రతలో పోలీసుల పాత్ర కీలకమని ఎస్పీ ఎస్‌వీ మాధవరెడ్డి తెలిపారు. మంగళవారం పార్వతీపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో పోలీసు అమరవీరుల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా అమ రుల స్థూపం వద్ద ఘన నివాళి అర్పించారు. విధి నిర్వహణలో ప్రాణాలర్పించి.. అమరులైన వారి సేవలు ఎప్పటికీ మరువలేమని ఎస్పీ కొనియాడారు. శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసు బలగాలు విశేష సేవలందిస్తున్నాయన్నారు. వారి త్యాగాలను ప్రతిఒక్కరూ గుర్తించాలన్నారు. కుటుంబాలకు దూరంగా ఉంటూ.. అహర్నిశలు శ్రమించే వారిని గౌరవించడం అందరి బాధ్యత అని తెలిపారు. పోలీస్ శాఖ పనితీరు, ప్రభుత్వ సహకారాన్ని కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి ప్రశం సించారు. అమరవీరుల స్ఫూర్తితో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. అనంతరం అమరులైన పోలీసు కుటుంబ సభ్యులకు చెక్కులు అందించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర, ఏఎస్పీ అంకితా సురాన, పాలకొండ డీఎస్పీ రాంబాబు, ఏఆర్ డీఎస్పీ థామస్ రెడ్డి, సీఐ, ఎస్‌ఐలు తదితరులు పాల్గొన్నారు.