collector నాగలి పట్టి.. దుక్కి దున్ని!
ABN , Publish Date - Jun 12 , 2025 | 12:39 AM
Plough in Hand... Fields Turned with the Yoke నాగలి పట్టి.. దుక్కి దున్ని రైతు అవతారంలో సందడి చేశారు కలెక్టర్ శ్యామ్ ప్రసాద్. ఏరువాక పౌర్ణమి సందర్భంగా దత్తివలసలో బుధవారం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పొలంలో విత్తనాలు జల్లే ముందు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఘనంగా ఏరువాక పౌర్ణమి
గరుగుబిల్లి, జూన్11(ఆంధ్రజ్యోతి): నాగలి పట్టి.. దుక్కి దున్ని రైతు అవతారంలో సందడి చేశారు కలెక్టర్ శ్యామ్ ప్రసాద్. ఏరువాక పౌర్ణమి సందర్భంగా దత్తివలసలో బుధవారం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పొలంలో విత్తనాలు జల్లే ముందు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పలువురి రైతులకు విత్తనాలు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తక్కువ పెట్టుబడులతో అధిక దిగుబడులు సాధించే రకాలను సాగు చేసుకోవాలన్నారు. ఈ ఏడాది రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నారు. ఖరీఫ్‌కు అవసరమైన విత్తనాలు, ఎరువులను సిద్ధం చేశామని వెల్లడించారు. ఈ ఏడాది 75 వేల ఎకరాల్లో నవధాన్యాల సాగు లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. పంట పొలాల్లో ఫాంఫాండ్స్ నిర్మాణాలతో పాటు కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇస్తున్నట్లు చెప్పారు. బ్యాంకుల నుంచి రూ. 3,280 కోట్ల మేర రుణ సౌకర్యం కల్పించనున్నట్లు స్పష్టం చేశారు. జిల్లా వ్యవసాయ శాఖాధికారి కె.రాబర్ట్‌పాల్ మాట్లాడుతూ.. ఖరీఫ్‌కు సంబంధించిన వ్యవసాయ సామగ్రిని రైతుసేవా కేంద్రాల్లో అందించ నన్నుట్లు తెలిపారు. ప్రకృతి సాగుకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. జిల్లా ప్రకృతి వ్యవసాయ ప్రాజెక్టు మేనేజర్ పి.షణ్ముఖరాజు మాట్లాడుతూ.. రైతులు పూర్తి విస్తీర్ణంలో నవధాన్యాలు వేసుకుని భూమిని సారవంతం చేసుకోవాలన్నారు. అనంతరం ప్రకృతి సాగులో ప్రతిభ కనబర్చిన ఆదర్శ రైతులను దుశ్శాలువాలతో సన్మానించారు.