సమగ్రాభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలి
ABN , Publish Date - Aug 13 , 2025 | 12:18 AM
నియోజక వర్గ సమగ్ర అభివృద్ధికి ఉన్న అవకాశాలను గుర్తించి అందుకు తగిన ప్రణాళికలను రూపొందించాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
మంత్రి కొండపల్లి శ్రీనివాస్
గజపతినగరం, ఆగస్టు 12(ఆంధ్రజ్యోతి): నియోజక వర్గ సమగ్ర అభివృద్ధికి ఉన్న అవకాశాలను గుర్తించి అందుకు తగిన ప్రణాళికలను రూపొందించాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మంగళవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గం అభివృద్ధిలో భాగంగా స్వర్ణాంధ్ర విజన్ 2029, స్వర్ణాంధ్ర 2047 ప్రణాళికలను రూపొందించాలని అధికారులకు సూచిం చారు. రైతుల ఆదాయాన్ని పెంచేందుకు వ్యవసాయ అనుబంధ రంగాలపై దృష్టి సారించాలన్నారు. అందు లో భాగంగా పాడి రైతుల ఆదాయం పెంచేందుకు సమగ్ర ప్రణాళికలను రూపొందించి అమలు చేయాల న్నారు. అవసరమైన రైతులకు వ్యవసాయ విద్యుత్ కనక్షన్లు అందజేసి రెండో పంట సాగు పెంచే దిశగా అధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. నియోజకవర్గాన్ని పర్యాటకరంగంగా అభివృద్ధి చేయాలన్నారు. ప్రతి మండలంలో పర్యాటక అభివృద్ధికి ఉన్న అవకాశాలను గుర్తించి అందుకు అవసర మైన స్థలాలను ఎంపిక చేయాలని సూ చించారు. నియోజకవర్గంలో వివిధ గ్రామా ల్లో భూ సర్వేతో తలెత్తిన వివాదాలను త్వరతి గతిన పరిష్కరించాలని రెవెన్యూ అధికారుల కు ఆదేశాలు జారీ చేశారు. క్షేత్రస్థాయి సిబ్బంది సకాలంలో స్పందించకుంటే వారిపై చర్యలు తీసుకో వాలని తహసీల్దార్లకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ పీవీవీ గోపాలరాజు, స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్ ప్రత్యేక అధికారి ప్రమీలాగాంధీ, గజపతి నగరం, దత్తిరాజేరు, బొండపల్లి, గంట్యాడ, జామి మండలాలకు చెందిన తహసీల్దార్లు, ఎంపీడీవోలు, మండలశాఖ అధికారులు పాల్గొన్నారు.