ఇంటింటా తాగునీటికి ప్రణాళికలు: ఎమ్మెల్యే
ABN , Publish Date - Nov 02 , 2025 | 12:33 AM
నెల్లిమర్ల నియోజకవర్గంలో 2028 నాటికి ఇంటింటికి పూర్తిస్థాయిలో తాగునీరు అందించేందుకు ప్రణాళిక సిద్ధంచేసినట్లు ఎమ్మెల్యే లోకం నాగమాధవి తెలిపారు.
డెంకాడ, నవంబరు 1(ఆంధ్రజ్యోతి): నెల్లిమర్ల నియోజకవర్గంలో 2028 నాటికి ఇంటింటికి పూర్తిస్థాయిలో తాగునీరు అందించేందుకు ప్రణాళిక సిద్ధంచేసినట్లు ఎమ్మెల్యే లోకం నాగమాధవి తెలిపారు. గుణుపూరుపేట, ముగి నాపల్లిలో నిర్మించిన జలజీవన్ మిషన్ పథకం, రైతు సేవా కేంద్రాం, సచివాలయం, వెల్‌నె స్ సెంటర్ నూతన భవనాలు ప్రారంభించారు. గుణుపూరుపేట, ముగినాపల్లి మధ్య ఆర్‌అండ్‌బీ రహదారి కల్వర్టుకు శంకుస్థాపన చేశారు.
నెల్లిమర్ల, నవంబరు 1(ఆంధ్రజ్యోతి): ప్రజా సంక్షేమమే కూటమి ప్రభుత్వం లక్ష్యమని నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగ మాధవి తెలిపారు. అలుగోలు తోపాటు ఆ పంచాయతీ పరిధిలోని పల్లిపేట, కొత్తూరుల్లో మన ప్రజలతో -మన ఎమ్మెల్యే కార్యక్రమం నిర్వహించారు. వీధుల్లో పర్యటించి ప్రజలతో మాట్లాడారు. గ్రామంలో వెలుగు వీవోఏపై వచ్చిన ఫిర్యాదులపై విచారణకు ఆదేశించారు. సెలవు దినం అయినా ఆదివారమే విచారణ పూర్తి చేయాలని ఏపీఎం సురేష్‌ను ఆదేశించారు.
పూసపాటిరేగ, నవంబరు 1(ఆంధ్రజ్యోతి): కోనాడలోగల వేణుగోపాలస్వామి ఆలయ అభివృద్ధికి కృషిచేస్తానని నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగమాధవి తెలి పారు. శనివారం కోనాడలో మత్యకారులకు బియ్యం, నిత్యావసర సరుకుల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ కోనాడలో సాగరతీరం అభివృద్ధి చేస్తానని తెలిపారు.