Share News

మురుగు కాలువల్లో పైపులైన్లు

ABN , Publish Date - Jun 29 , 2025 | 11:31 PM

మండలంలోని పెంట, దిబ్బగుడ్డివలస తదితర గ్రామాల్లో తాగునీటి పైపులైన్లు ము రుగుకాలువల చెంతనే ఉండడంతో ప్రమాదం పొంచిఉంది.

మురుగు కాలువల్లో పైపులైన్లు

  • పర్యవేక్షణ లేకపోవడంతో పొంచి ఉన్న ప్రమాదం

  • ఇదీ బొబ్బిలి మండలంలో పలు గ్రామాల్లో పరిస్థితి

బొబ్బిలి రూరల్‌, జూన్‌ 29 (ఆంధ్రజ్యోతి): మండలంలోని పెంట, దిబ్బగుడ్డివలస తదితర గ్రామాల్లో తాగునీటి పైపులైన్లు ము రుగుకాలువల చెంతనే ఉండడంతో ప్రమాదం పొంచిఉంది. ప్రధానంగా పైపులైన్ల నిర్వహణపై పంచాయతీ అఽధికారుల పర్యవేక్షణ లేకుండాపో యింది. వాస్తవానికి పైపులైన్ల ఏర్పా టుచేసిన సమయంలోనే కాలువల గుండా వెళ్లకుండా చర్యలు తీసుకో వాల్సి ఉంది. పైపులైన్ల చెంత నుం చే మురుగు ప్రవహించడం వల్ల తాగునీరు కలుషితమయ్యే ప్రమాద ముందన్న ఆందోళన నెలకొంది. దీనికితోడు దశాబ్దాల కిందట ఏర్పా టుచేసిన పైపులు కావడంతో అక్క డక్కడ లీకవుతుండడంతో వీటి గుండా మురుగునీరు చేరు అవకా శముందని పలువురు వాపోతున్నా రు. పలు గ్రామాల్లో రోడ్లు ఏర్పాటు చేసినా కాలువలు లేకపోవడంతో వర్షం కురిస్తే ఇళ్లలోని వాడుకనీరు రోడ్డుపైకి చేరుతోంది. కొన్నిచోట్ల రోడ్డుకు ఆనుకుని ఉన్న పైపుల వద్ద రోజుల తరబడి మురుగునీరు నిల్వ ఉంటోంది. పలు గ్రామాల్లో ఉదయం ఒకేసారి మురుగునీరు బయటకు విడిచిపెట్టడంతో పైపులు ఆ నీటిలో మునుగుతున్నాయి. పలుసార్లు పంచాయతీ అధికారుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్లినా పట్టించుకోవడంలేదన్న విమర్శలొస్తున్నాయి. ప్రస్తుతం వర్షాలు కురుస్తుండడంతో కలుషితనీరు తాగడం వల్ల వ్యాధులు ప్రబలే అవకాశముందన్న ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో తక్షణమే పంచాయతీ అధికారులు మురుగునీటిలో ఉన్న పైపులైన్లను తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

Updated Date - Jun 29 , 2025 | 11:31 PM