Share News

Pineapple పైనాపిల్‌ ధర పతనం

ABN , Publish Date - Jun 29 , 2025 | 11:34 PM

Pineapple Prices Plummet ఏజెన్సీలో గిరిజనుల సేకరించే అటవీ ఉత్పత్తుల్లో ఒకటైన పైనాపిల్‌ ధర ఒక్కసారిగా పడిపోయింది. గత వారం ఒక్కో పండు ధర రూ.15 పలకగా ప్రస్తుతం రూ.8కి చేరింది. దిగుబడులు పెరగడం, ఇటీవల కాలంలో జోరుగా వర్షాలు కురుస్తుండడంతో దాని రేటు ఒక్కసారిగా పతనమైంది.

Pineapple   పైనాపిల్‌   ధర పతనం
వ్యాపారులు తీసుకొచ్చిన వ్యాన్‌లోకి పైనాపిల్‌ను లోడ్‌ చేస్తున్న దృశ్యం

సీతంపేట రూరల్‌, జూన్‌ 29(ఆంధ్రజ్యోతి): ఏజెన్సీలో గిరిజనుల సేకరించే అటవీ ఉత్పత్తుల్లో ఒకటైన పైనాపిల్‌ ధర ఒక్కసారిగా పడిపోయింది. గత వారం ఒక్కో పండు ధర రూ.15 పలకగా ప్రస్తుతం రూ.8కి చేరింది. దిగుబడులు పెరగడం, ఇటీవల కాలంలో జోరుగా వర్షాలు కురుస్తుండడంతో దాని రేటు ఒక్కసారిగా పతనమైంది. ఆదివారం సీతంపేట వారపు సంతలో ఒక్కో పైనాపిల్‌ను రూ.8 చొప్పున విక్రయించారు. ఓ వైపు చిరుజల్లులు.. మరోవైపు భారీగా ధర తగ్గడంతో గిరిజన రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంటను భద్రపరుచుకునేందుకు అవకాశం లేకపోవడంతో దళారులు చెప్పిన రేటుకే పంటను విక్రయిస్తూ తీవ్రంగా నష్టపో తున్నారు. మరోవైపు మైదాన ప్రాంత వ్యాపారులు కారుచౌకగా పైనాపిల్‌ను కొనుగోలు చేసి మైదాన ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఐటీడీఏ అధికారులు స్పందించి పైనాపిల్‌కు గిట్టుబాటు ధర వచ్చేలా చర్యలు తీసుకోవాలని గిరిజన రైతులు కోరుతున్నారు.

Updated Date - Jun 29 , 2025 | 11:34 PM