Share News

భక్తిశ్రద్ధలతో పీర్లకొండ యాత్ర

ABN , Publish Date - Dec 05 , 2025 | 12:09 AM

:ఇచ్ఛాపురంలో గురువారం పీర్లకొండ యాత్ర భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా మూడోవారం ఒడిశాలోని భువనేశ్వర్‌ తదితర ప్రాంతాలు, విశాఖ, హైదరాబాద్‌, జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు.

 భక్తిశ్రద్ధలతో పీర్లకొండ యాత్ర
కొండపై పూజల కోసం బారులు తీరిన భక్తులు:

ఇచ్ఛాపురం, డిసెంబరు 4(ఆంధ్రజ్యోతి):ఇచ్ఛాపురంలో గురువారం పీర్లకొండ యాత్ర భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా మూడోవారం ఒడిశాలోని భువనేశ్వర్‌ తదితర ప్రాంతాలు, విశాఖ, హైదరాబాద్‌, జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు. ఇక్కడ ఏటా మార్గశిరమాసం గురువారాల్లో కొండపై కులమాతాలకు అతీ తంగా పూజలు నిర్వహిస్తుంటారు. హిందువులు పూజా సామగ్రిని తీసుకువెళ్తే అక్కడ ముస్లిములు వాటిని భగవంతునికి నివేదిస్తారు. ఈ సందర్భంగా పీర్లకొండ మొదటి మెట్టుపై భక్తులు కొబ్బరి కాయలు కొట్టి దీపారాదన చేశారు. అనంతరం కొండపైకి వెళ్లి పూజలు జరిపారు. కొండపై గల కంధకం నీటిని తీసుకొనేందుకు భక్తులు పోటీ పడ్డారు.

Updated Date - Dec 05 , 2025 | 12:09 AM