Share News

We Made It హమ్మయ్యా.. బతికాం!

ABN , Publish Date - Aug 15 , 2025 | 11:41 PM

Phew… We Made It దుగ్గేరు గ్రామం సమీపంలోని అడారి గెడ్డలో కొట్టుకు పోతున్న ఇద్దరు వ్యక్తులను స్థానిక యువకులు కాపాడి క్షేమంగా ఒడ్డుకు చేర్చారు. అయితే ఈ ఘటనలో వారి బైక్‌ మాత్రం వరద ఉధృతిలో కొట్టుకుపోయింది.

 We Made It హమ్మయ్యా.. బతికాం!
గెడ్డలో కొట్టుకుపోతున్న వ్యక్తులను కాపాడి ఒడ్డుకు తీసుకొస్తున్న యువకులు

  • కాపాడిన యువకులు

  • వంతెన నిర్మించాలని గిరిజనుల డిమాండ్‌

మక్కువ రూరల్‌, ఆగస్టు15 (ఆంధ్రజ్యోతి): దుగ్గేరు గ్రామం సమీపంలోని అడారి గెడ్డలో కొట్టుకు పోతున్న ఇద్దరు వ్యక్తులను స్థానిక యువకులు కాపాడి క్షేమంగా ఒడ్డుకు చేర్చారు. అయితే ఈ ఘటనలో వారి బైక్‌ మాత్రం వరద ఉధృతిలో కొట్టుకుపోయింది. వివరాల్లోకి వెళ్తే.. పనసభద్ర పంచాయతీ పరిధి గిరిశిఖర గ్రామం పొయ్యమాలకి చెందిన చోడిపిల్లి చంద్ర బైక్‌పై శుక్రవారం ఉదయం తన బంధువుతో కలిసి మక్కువ ప్రాంతానికి వెళ్లాడు. స్వాతంత్య్రం దినోత్సవం సందర్భంగా గిరిజన హాస్టల్‌లో చదువుతున్న తమ పిల్లలను చూసి సాయంత్రం తిరిగి స్వగ్రామానికి బయల్దేరాడు. మార్గమధ్యలో అడారి గెడ్డపై ఉన్న కాజ్‌వేను దాటి వెళ్లేందకు ప్రయత్నించాడు. అయితే గత రెండు రోజులుగా కురిసిన వర్షాలకు ఒక్కసారిగా అక్కడ వరద ఉధృతి పెరిగింది. దీంతో వారు అదుపు తప్పి గెడ్డలో జారిపడ్డారు. బైక్‌తో సహా కొంతదూరం కొట్టుకుపోయారు. ఇది గమనించిన గుంటభద్ర గ్రామానికి చెందిన యువకులు ఒక్కసారిగా గెడ్డలోకి దూకి వారిద్దరినీ కాపాడారు. క్షేమంగా ఒడ్డుకు చేర్చడంతో అక్కడకున్నవారంతా ఊపిరిపీల్చుకున్నారు. గాయాలేమీ కాకపోవడంతో వారు వేరే వాహన సాయంతో ఇళ్లకు చేరారు. కాగా గుంటభద్రతో మరో పలు గ్రామాల గిరిజనులు అడారు గెడ్డపై తాడును కట్టి ఒక్కొక్కరుగా కాజ్‌వేను దాటి ఇళ్లకు చేరుకున్నారు. ఏటా వర్షాకాలంలో తమకి ఈ ఇబ్బందులు తప్పడం లేదని, తక్షణమే ఈ ప్రాంతంలో వంతెన నిర్మించాలని వారు కోరుతున్నారు.

Updated Date - Aug 15 , 2025 | 11:41 PM