Share News

దశలవారీగా ప్లాస్టిక్‌ నిర్మూలన

ABN , Publish Date - Jul 19 , 2025 | 11:27 PM

జిల్లాలో దశల వారీగా ప్లాస్టిక్‌ను నిర్మూలించేందుకు చర్యలు తీసుకుం టున్నామని, అన్నివర్గాల సహకారంతో లక్ష్యాన్ని సాధిం చేందుకు కృషి చేస్తున్నామని కలెక్టర్‌ డాక్టర్‌ బీఆర్‌ అంబే డ్కర్‌ తెలిపారు.

దశలవారీగా ప్లాస్టిక్‌ నిర్మూలన

  • పారిశుధ్య నిర్వహణలో క్లాప్‌ మిత్రల పాత్ర కీలకం

  • కలెక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌

చీపురుపల్లి, జులై 19 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో దశల వారీగా ప్లాస్టిక్‌ను నిర్మూలించేందుకు చర్యలు తీసుకుం టున్నామని, అన్నివర్గాల సహకారంతో లక్ష్యాన్ని సాధిం చేందుకు కృషి చేస్తున్నామని కలెక్టర్‌ డాక్టర్‌ బీఆర్‌ అంబే డ్కర్‌ తెలిపారు. పారిశుధ్యాన్ని మెరుగు పరచడంతో బాటు, పర్యావరణ పరిరక్షణపై అవగా హన కల్పించ డంకోసం ప్రతి నెలా స్వచ్ఛాం ధ్ర- స్వర్ణాంధ్ర కార్యక్రమా న్ని జిల్లాలో నిర్వహిస్తు న్నామని చెప్పారు. శనివారం చీపు రుపల్లిలో స్వచ్ఛాం ధ్ర- స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగం గా పంచాయతీ కార్యాలయం నుంచి మూడు రోడ్ల కూడ లి వరకూ ర్యాలీ నిర్వ హించారు. మూడురోడ్లజంక్షన్‌లో ఏర్పాటుచేసిన మానవహారంలో కలెక్టర్‌ పర్యావరణంపై ప్రతిజ్ఞ చేయించారు. తొలుత పంచాయతీ కార్యాల యంలో జరి గిన ఆయన మాట్లాడుతూ ప్రతినెలా ఒక్కో అంశానికి ప్రాధా న్యతనిస్తూ కార్యక్రమాలు నిర్వహిస్తు న్నామని తెలిపారు. ప్లాస్టిక్‌ నిర్మూలనే లక్ష్యంగా ఈనెల కార్య క్రమాన్ని రూపొం దించామని చెప్పారు. పారిశుధ్య నిర్వహణలో క్లాప్‌ మిత్రల పాత్రకీలకమన్నారు. అనంత రం క్లాప్‌మిత్రలకు సనించారు. కార్యక్రమంలో జడ్పీ సీఈ వో సత్యనారాయణ, డీఎల్‌ డీవో హేమసుందర్‌, ఎంపీపీ ఇప్పిలి వెంకటనరసమ్మ, చీపురు పల్లి సర్పంచ్‌ మంగళగి రి సుధారాణి, జడ్పీటీసీ వలిరెడ్డి శిరీష, ఎంపీడీవో ఐ. సురేష్‌, తహశీల్దార్‌ డి.ధర్మరాజు, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, కూటమి నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Jul 19 , 2025 | 11:27 PM