గుండెపోటుతో పీఈటీ మృతి
ABN , Publish Date - Aug 15 , 2025 | 12:26 AM
కిల్తంపాలెం జవహర్ నవోదయ విద్యాలయంలో క్రీడాకారులకు హ్యాండ్‌బాల్ పోటీలకు శిక్షణ ఇవ్వడానికి వచ్చిన పీఈటీ ప్రదీప్‌భారతి(32) గురువారం గుండెపోటుతో మృతిచెందారు.
ఎస్.కోట రూరల్, ఆగస్టు 14(ఆంధ్రజ్యోతి): కిల్తంపాలెం జవహర్ నవోదయ విద్యాలయంలో క్రీడాకారులకు హ్యాండ్‌బాల్ పోటీలకు శిక్షణ ఇవ్వడానికి వచ్చిన పీఈటీ ప్రదీప్‌భారతి(32) గురువారం గుండెపోటుతో మృతిచెందారు. తెలంగా ణా రాష్ట్రం అదిలాబాద్ జిల్లా జవహర్ నవోదయలో పనిచేస్తున్న ఈయన ఈ నెల 21, 22న బీహార్‌లో జరుగనున్న నేషనల్ హ్యాండ్‌బాల్ పోటీలకు ఇక్కడ క్రీ డాకారులకు శిక్షణ ఇవ్వడానికి మరో నలుగురు పీఈటీలతో కలిసి వచ్చారు. గు రువారం శిక్షణ పూర్తయిన వెంటనే మధ్యాహ్నం భోజనానికి కూర్చున్నారు. ప్లే టు ముందు ఒక్కసారిగా కుప్పకూలారు. సహచరులు వెంటనే ప్రిన్సిపాల్ దుర్గా ప్రసాద్‌కు తెలియజేయడంతో, ఆయన వెంటనే బొడ్డవర కోలేకేటేడ్ వైద్యులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి విద్యాలయం అంబులెన్స్‌లో ఎస్.కోట సీహెచ్ సీకి తరలించారు. పరీక్షించిన వైద్యులు.. అప్పటికే మృతిచెందినట్టు ధ్రువీకరించా రు. గుండెపోటుతో మృతిచెందినట్టు నిర్ధారించారు. మృతుడిది ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కాగా, ఈయన భార్య తెలంగాణా రాష్ట్రం అదిలాబాద్‌లోని నవోదయలో ఉపాధ్యాయినిగా పనిచేస్తున్నారు.