వ్యక్తిగత పరిశుభ్రత అవసరం
ABN , Publish Date - Dec 21 , 2025 | 12:04 AM
చదువు తో పాటు విద్యార్థులు క్రమశిక్షణ, వ్యక్తిగత పరిశుభ్రత పై దృష్టి పెట్టాలని ఎమ్మెల్యే కిమిడి కళావెంకటరావు అన్నారు.
చీపురుపల్లి, డిసెంబరు 20 (ఆంధ్రజ్యోతి): చదువు తో పాటు విద్యార్థులు క్రమశిక్షణ, వ్యక్తిగత పరిశుభ్రత పై దృష్టి పెట్టాలని ఎమ్మెల్యే కిమిడి కళావెంకటరావు అన్నారు. చీపురుపల్లిలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో శనివారం జరిగిన ముస్తాబు కార్యక్రమం లో ఆయన పాల్గొన్నారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మా ట్లాడారు. పాఠశాల అభివృద్ధికి అవసరమైన నిధుల విడుదలకు తన వంతు కృషి చేస్తానన్నారు. ప్రిన్సిపాల్ రాణిశ్రీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్ర మంలో డీడీవో హేమసుందర్, ఎంపీడీవో ఐ.సురేష్, తహసీల్దార్ డి.ధర్మరాజు, పార్టీ నాయకులు కుచ్చర్లపా టి త్రిమూర్తులరాజు, రౌతు కామునాయుడు, పైల బలరాం, గవిడి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
భోగాపురం, డిసెంబరు 20(ఆంధ్రజ్యోతి): శరీరక పరిశుభ్రతతోనే ఆరోగ్యంగా ఉండగలమని రాష్ట్ర మార్క్‌ఫెడ్ చైర్మన్, టీడీపీ నెల్లిమర్ల నియోజకవర్గ ఇన్‌చార్జి కర్రోతు బంగార్రాజు అన్నారు. భోగాపురం ఆదర్శ పాఠశాలలో శనివారం నిర్వహించిన ముస్తాబు కార్యక్రమంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. విద్యా ర్థులు ప్రతిరోజూ శుభ్రంగా తయారై పాఠశాలకు హాజ రు కావాలన్నారు. మండల ప్రత్యేక అధికారి వెంకటేశ్వ రావు, ఎంపీడీవో డీడీ స్వరూపరాణి, నాయకులు కర్రో తు సత్యనారాయణ, కొమ్మూరు సుభోషణరావు, ఎంఈవోలు రమణమూర్తి, చంద్రమౌళి, ప్రిన్సిపాల్ సి.పార్వతి పాల్గొన్నారు.