Cleanliness పరిసరాలతో పాటు వ్యక్తిగత పరిశుభ్రత ముఖ్యం
ABN , Publish Date - Nov 16 , 2025 | 12:06 AM
Personal Hygiene Along with Environmental Cleanliness is Important ప్రతిఒక్కరూ పరిసరాలతో పాటు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరి అన్నారు. శనివారం కురుపాం ఏపీ ఆదర్శ పాఠశాలలో నిర్వహించిన స్వచ్ఛాంధ్ర- స్వర్ణాంధ్ర కార్యక్రమంలో కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డితో కలిసి పాల్గొన్నారు.
కురుపాం, నవంబరు15(ఆంధ్రజ్యోతి): ప్రతిఒక్కరూ పరిసరాలతో పాటు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరి అన్నారు. శనివారం కురుపాం ఏపీ ఆదర్శ పాఠశాలలో నిర్వహించిన స్వచ్ఛాంధ్ర- స్వర్ణాంధ్ర కార్యక్రమంలో కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గ్రామాల్లో పారిశుధ్యానికి పెద్దపీట వేయాలన్నారు. ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా తగ్గించాలని, చేతులు ఎప్పటికప్పుడు శుభ్రపరచుకోవాలని సూచించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ .. విద్యార్థులకు వ్యక్తిగత శుభ్రతపై అవగాహన కల్పించేందుకు పాఠశాల, కళాశాలల్లో ముస్తాబు అనే వినూత్న కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. పిల్లలు శుభ్రంగా ఉంటే వ్యాధులు దరి చేరవని తెలిపారు. అనంతరం విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో డీపీవో కొండలరావు, సర్వ శిక్ష అభియాన్ ఏపీసీ తేజేశ్వరరావు, విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు.