Share News

చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

ABN , Publish Date - Oct 25 , 2025 | 12:19 AM

ఎస్‌.కోట నానిగిరి వీధిలో తన ఇంటి దగ్గర ఉన్న చెట్టుకొమ్మలు కొడుతూ జారిపడిన వ్యక్తి విశాఖలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందాడు.

చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

ఎస్‌.కోట రూరల్‌, అక్టోబరు 24(ఆంధ్రజ్యోతి): ఎస్‌.కోట నానిగిరి వీధిలో తన ఇంటి దగ్గర ఉన్న చెట్టుకొమ్మలు కొడుతూ జారిపడిన వ్యక్తి విశాఖలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నానిగిరి వీధికి చెందిన నానిగిరి చంద్రరావు (50) ఈనెల 19న తన ఇంటికి సమీపంలో ఉన్న చెట్టు ఎక్కి కొమ్మలు నరుకు తుండగా ప్రమాదవశాత్తు పైనుంచి జారి పడ్డాడు. వెంటనే కుటుంబీకులు ఎస్‌.కోట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో విశాఖపట్నంలోని ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చి చికిత్స చేయిస్తున్నారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడు. భార్య శంకరీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Oct 25 , 2025 | 12:19 AM