చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
ABN , Publish Date - Oct 18 , 2025 | 12:15 AM
పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన వ్యక్తి చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందాడు.
కొత్తవలస, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి): పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన వ్యక్తి చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని తుమ్మికాపల్లి గ్రామానికి చెందిన బొబ్బర సోమునాయుడు(51) మద్యానికి బానిస కావడంతో ఆరోగ్యం పూర్తిగా పాడైపోయింది. మద్యానికి బానిస అవడంతో భార్య మందలిస్తుండేది. దీంతో మనస్తాపానికి గురైన సోమునాయుడు ఈనెల 15వ తేదీ ఉదయం 4 గంటల సమయంలో పురుగు మందు తాగాడు. వెంటనే ఎస్.కోట ఆసుపత్రికి, అక్కడ నుంచి విజయనగరం ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన శుక్రవారం మృతిచెందాడు. మృతుడి కోడలు జయమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐ షణ్ముఖరావు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.