చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
ABN , Publish Date - Sep 27 , 2025 | 12:16 AM
మనస్థాపంతో పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఓ యువకుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతిచెందాడు.
గుర్ల, సెప్టెంబరు 26(ఆంధ్రజ్యోతి): మనస్థాపంతో పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఓ యువకుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతిచెందాడు. వివరాలు ఇలా ఉన్నాయి. గుర్ల మండలంలోని దమరసింగు గ్రామానికి చెందిన పిన్నింటి సత్యనారాయణ(27) నాలుగు రోజుల కిందట ఇంటి వద్ద పెళ్లి విషయంలో మనస్థాపం చెంది పురుగు మందు తాగాడు. కుటుంబ సభ్యులు వెంటనే విజయనగరం ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యం పొందుతూ గురువారం రాత్రి మృతిచెందాడు. సత్యనారాయణ రైల్వే ఉద్యోగం చేస్తున్నాడు. గత ఏడాది పరీక్షల్లో పాసై ఉద్యోగం సాధించాడు. ఇంతలోనే పెళ్లి విషయం ఏమీ తేల్చుకోలేక ఇబ్బందులు పడుతూ తీవ్ర మనస్థాపానికి గురై, ఆత్మహత్య పాల్పడినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుడికి అన్నయ్య, వదిన, నాన్న ఉన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ నారాయణరావు తెలిపారు.