భజనలు చేస్తూ.. సంకీర్తనలు పాడుతూ
ABN , Publish Date - Jul 06 , 2025 | 12:05 AM
ww

కొత్తవలస, జూలై 5 (ఆంధ్రజ్యోతి) : మండలంలోని మంగళపాలెంలో గల గురుదేవ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో శనివారం ట్రస్టు కార్యాలయం నుంచి సింహాచలం వరకు పాదయాత్రను నిర్వహించారు. పూరిలో జరుగుతున్న స్వామివారి జగన్నాథ రథయాత్రను పురస్కరించుకుని ఈ యాత్రను ప్రతిఏటా నిర్వహిస్తుంటారు. ట్రస్టు చైర్మన్ రాపర్తి జగదీష్‌బాబు ఆధ్వర్యంలో ఒడిశా, అరకు, విజయనగరం, విశాఖ జిల్లాలకు చెందిన 60 గ్రామాల నుంచి సుమారు రెండు వేలమంది భజనలు చేస్తూ.. సంకీర్తనలు పాడుతూ పాదయాత్రగా సింహాచలంలోని వరహాలక్ష్మి నృసింహాస్వామివారిని దర్శించుకున్నారు.గిరిపుత్రులతోపాటు తరిగొండ వెంగమాంబ భజనబృందం సభ్యులు భజనలు చేసుకొని పాదయాత్ర చేశారు.