ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడాలి
ABN , Publish Date - Apr 25 , 2025 | 11:52 PM
ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుప డాలని కలెక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోరారు. రాజాంలో నియోజకవర్గ క్షేత్రస్థాయి అధికా రులు, సిబ్బందితో కలెక్టర్ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లా తలసరి ఆదాయం పెరిగే మార్గాలపై దృష్టి సారించాలన్నారు.
రాజాం రూరల్, ఏప్రిల్ 25 (ఆంధ్రజ్యోతి): ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుప డాలని కలెక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోరారు. రాజాంలో నియోజకవర్గ క్షేత్రస్థాయి అధికా రులు, సిబ్బందితో కలెక్టర్ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లా తలసరి ఆదాయం పెరిగే మార్గాలపై దృష్టి సారించాలన్నారు. సాగుచేయని మిగు లు భూముల్ని దశలవారీగా సాగులోకి తీసుకురావాలని అధికారులకు సూచించారు. భోగాపురం విమానాశ్రయం ఏర్పాటైతే టూరిజం అభివృద్ధి చెందుతుందన్న ఆశాభావం వ్యక్తంచేశారు. తొలుత ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల స్టాల్‌ను కలెక్టర్ అంబేడ్కర్ పరి శీలించారు. రైతులకు నవధాన్యాల కిట్లు అందజేశారు. సమావేశంలో ముఖ్య ప్రణాళికా ధికారి బాలాజీ, వ్యవసాయ, పశుసంవర్ధక, ఉద్యానవనశాఖ జేడీలు వీటీ రామారావు, వైవీ రమణ,ఏవీఎస్వీ జమదగి, ఏపీఎంఐపీ పీడీ లక్ష్మీనారాయణ శాఖాపరమైన కార్యక్ర మాలను వివరించారు. కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి ఆసయ్య, చీపురుపల్లి ఆర్డీవో సత్యవాణి, ప్రకృతి వ్యవసాయం డీపీఎం ఆనందరావు పాల్గొన్నారు.
రెండు పూటలా పనులు చేయించండి
రాజాం, ఏప్రిల్ 25 (ఆంధ్రజ్యోతి): ఉపాధి వేతనదారులకు రెండుపూటలా పనులు చేయించాలని కలెక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆదేశించారు.అత్యధిక వేతనం వచ్చేలా పనులు నిర్వహించాలని కోరారు. శుక్రవారం రాజాం మండలపరిషత్ కార్యాలయంలో నియోజక వర్గ స్థాయిలో అధికారులతో ఉపాధి హామీ పథకం పనుల తీరు, వేతనదారులు అందు కుంటున్న సగటు వేతనంపై సమీక్షించారు. సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడు తూ వేసవిని దృష్టిలో ఉంచుకొని ఎండ తీవ్రత లేని సమయంలో పనులు నిర్వహించా లని ఆదేశించారు. ఉదయాన్నే వీలైనంత వేగంగా పనులు మొదలయ్యేలా, వేతనదారు లు వడదెబ్బకు గురికాకుండా తగిన చర్యలు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. తాగు నీరు, నీడ సదుపాయం కల్పించాలని తెలిపారు. వేతనదారులకు రోజుకి రూ.307 వరకు అందుకొనే అవకాశముందని, పనులను పెంచి గరిష్ట వేతనం అందుకునేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ విషయంలో ఎవరు జాప్యం చేసినా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సమావేశంలో డ్వామా పీడీ ఎస్.శారదా దేవి, ఆర్డీవో సత్యవాణి, ఎంపీడీవోలు, ఏపీవోలు, సాంకేతక సహాయకులు పాల్గొన్నారు