Pensions యథావిధిగానే పింఛన్లు
ABN , Publish Date - Dec 01 , 2025 | 01:07 AM
Pensions to Continue as Usual జిల్లాలో లబ్ధిదారులందరికీ ఈనెలలో యాథావిధిగానే ఎన్టీఆర్ భరోసా పింఛన్లు అందించనున్నారు. 15 మండలాలు, మూడు అర్బన్‌ల పరిధిలో 1,39,588 మందికి సోమవారం పింఛన్లు అందజేసేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. వాటికి సంబంధించి రూ. 59.49 కోట్లు సచివాలయాలకు కేటాయించారు.
గరుగుబిల్లి, నవంబరు30(ఆంధ్రజ్యోతి): జిల్లాలో లబ్ధిదారులందరికీ ఈనెలలో యాథావిధిగానే ఎన్టీఆర్ భరోసా పింఛన్లు అందించనున్నారు. 15 మండలాలు, మూడు అర్బన్‌ల పరిధిలో 1,39,588 మందికి సోమవారం పింఛన్లు అందజేసేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. వాటికి సంబంధించి రూ. 59.49 కోట్లు సచివాలయాలకు కేటాయించారు. ఇదిలా ఉండగా గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నకిలీ ధ్రువీకరణ పత్రాలతో దివ్యాంగ పింఛన్లు పొందిన వారికి రీవెరిఫికేషన్ కొనసాగుతోంది. జిల్లాలోని ప్రధాన ఆసుపత్రుల్లో చేపడుతున్న సదరం శిబిరానికి వారిని రిఫర్ చేశారు. పార్వతీపురం, కురుపాం, సీతంపేట, విజయనగరం, పాలకొండ, సాలూరు, తదితర ఆసుపత్రులకు సుమారు 1,863 మంది మొదటి విడతగా తనిఖీలకు హాజరయ్యారు. రెండో విడతలో మరో 611 మంది దివ్యాంగులకు ఆసుపత్రులకు వెళ్లనున్నారు. కాగా తనిఖీలు పూర్తి చేసుకున్న వారు సంబంఽధిత కార్యాలయాలకు ధ్రువీకరణ పత్రాలు పంపించలేదు. దీంతో ఈ నెలలోనూ లబ్ధిదారులందరికీ పింఛన్లు అందించనున్నారు. దీనిపై డీఆర్‌డీఏ పీడీ ఎం.సుధారాణిని వివరణ కోరగా.. ‘ జిల్లాలో దివ్యాంగ పింఛన్లు పొందుతున్న వారికి ఈ నెలలో యథావిధిగా పింఛన్ సొమ్ము అందుతుంది. కొందరు రీవెరిఫికేషన్‌కు వెళ్లారు.అయితే వీరి పూర్తి సమాచారం రావాల్సి ఉంది. ధ్రువీకరణ పత్రాలు, వైకల్య శాతం పునఃపరిశీలన కొనసాగుతుంది. పూర్తిస్థాయి నివేదికలు అందిన తదుపరే చర్యలు తీసుకుంటాం. పింఛన్ పొందుతూ మృతి చెందిన వారి కుటుంబాలకే ఈ నెలలో పింఛన్ మంజూరవుతుంది. నూతన పింఛన్లకు ఆదేశాలు రాలేదు. ’ అని తెలిపారు.