Pension Distribution యథావిధిగానే.. నేడు పింఛన్ల పంపిణీ
ABN , Publish Date - Dec 30 , 2025 | 11:25 PM
Pension Distribution to Continue as Usual Today జిల్లా పరిధిలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీలో ఎటువంటి తొలగింపులు లేవని అధికారులు వెల్లడించారు. జవవరి నెలకు సంబంధించి దివ్యాంగులందరికీ యథావిధిగానే పింఛన్లు అందించనున్నట్లు ప్రకటించారు. కాగా నూతన సంవత్సరాన్ని దృష్టిలో పెట్టుకుని నేడు (ఒక రోజు ముందుగానే) పింఛన్లు పంపిణీ చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేశారు.
తొలగింపులు లేవని అధికారుల వెల్లడి
గరుగుబిల్లి, డిసెంబరు 30(ఆంధ్రజ్యోతి): జిల్లా పరిధిలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీలో ఎటువంటి తొలగింపులు లేవని అధికారులు వెల్లడించారు. జవవరి నెలకు సంబంధించి దివ్యాంగులందరికీ యథావిధిగానే పింఛన్లు అందించనున్నట్లు ప్రకటించారు. కాగా నూతన సంవత్సరాన్ని దృష్టిలో పెట్టుకుని నేడు (ఒక రోజు ముందుగానే) పింఛన్లు పంపిణీ చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే సంబంధిత సచివాలయాలకు అవసరమైన మొత్తాలు అందించారు. జిల్లాలో వివిధ రకాల పింఛన్‌దారులు 1,39,291 మంది వరకూ ఉన్నారు. వారి కోసం ప్రభుత్వం రూ. 60.02 కోట్లు విడుదల చేసింది. దీనిపై జిల్లా గ్రామీణాభివృద్ధి పీడీ సుధారాణి మాట్లాడుతూ.. ‘దివ్యాంగ పింఛన్‌దారులకు సదరం క్యాంపులు కొనసాగుతున్నాయి. ఈ మేరకు లబ్ధిదారులందరికీ పింఛన్ సొమ్ము అందిస్తాం. జనవరి నెలకు సంబంధించి పింఛన్ల తొలగింపులు లేవు. కొత్తగా మంజూరైన వితంతువు పింఛన్లు కూడా నేడు అందిస్తాం.’ అని తెలిపారు.