Share News

దస్తావేజు లేఖర్ల పెన్‌డౌన్‌

ABN , Publish Date - Sep 20 , 2025 | 12:13 AM

ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన 2.0 విధానం వల్ల ప్రజలతో పా టు తమకు అసౌకర్యం కలుగుతుందని దస్తావేజు లేఖ ర్లు ఆవేదన వ్యక్తం చేశారు.

దస్తావేజు లేఖర్ల పెన్‌డౌన్‌

నెల్లిమర్ల, సెప్టెంబరు 19(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన 2.0 విధానం వల్ల ప్రజలతో పా టు తమకు అసౌకర్యం కలుగుతుందని దస్తావేజు లేఖ ర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ విధానాన్ని నిరసి స్తూ శుక్రవారం పెన్‌డౌన్‌ నిర్వహించారు. అనంతరం సబ్‌ రిజిస్ట్రార్‌ రాజుకు వినతిపత్రం అందజేశారు. డాక్యు మెంట్‌ రైటర్స్‌ అసోసియేషన్‌ నెల్లిమర్ల శాఖ ప్రతిని ధులు పాల్గొన్నారు.

కొత్తవలస: కొత్తవలస సబ్‌ రిజిస్ట్రార్‌ పరిధిలో ఉన్న దస్తావేజు లేఖర్లు శుక్రవారం పెన్‌డౌన్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. కొత్తవలస సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ప్రతిరోజూ సుమారు 70 రిజిస్ట్రేషన్లు చేసుకునేందుకు స్లాట్‌బుకింగ్‌ సౌకర్యం ఉండగా.. పెన్‌డౌన్‌ కారణంగా ఒక రిజిస్ట్రేషన్‌ మాత్రమే జరిగింది. దస్తావేజు లేఖర్లు సబ్‌రిజస్ట్రార్‌ కార్యాలయానికి వెళ్లి, ఆందోళన చేశారు. అనంతరం సబ్‌ రిజిస్ట్రార్‌ చిన్నమ్మలుకు వినతిపత్రం అందజేశారు.

Updated Date - Sep 20 , 2025 | 12:13 AM